ఫార్మా జోరు, బ్యాంకుల దెబ్బ

3 Apr, 2020 16:12 IST|Sakshi

వరుసగా రెండో సెషన్ లోనూ నష్టాలే

ఇంట్రాడేలో 700 పాయింట్లకు పైగా పతనం

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్  మార్కెట్లు వరుసగా రెండవ సెషన్ లో  కూడా భారీ నష్టాల్లో ముగిసాయి. ఆరంభం నుంచి ఏ మాత్రం తేరుకోని కీలక సూచీలు శుక్రవారం ట్రేడ్ చివరి గంటలో 2 శాతానికి పైగా నష్టాలను మూటగట్టుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 674 పాయింట్ల నష్టాలతో 27590 వద్ద, నిఫ్టీ 170 పాయింట్లు  నష్టంతో 8083 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ 8100 స్థాయిని కూడా నిలబెట్టుకోలేకపోయింది. ముఖ్యంగా నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రభుత్వ బ్యాంకులు ఆటో, ఐటి రంగాల సూచీలు 1.4-3.4 శాతం  క్షీణించాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, టైటన్, హెచ్‌డిఎఫ్‌సి, కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, విప్రో, మారుతి సుజుకి,  టాటా స్టీల్ అత్యధికంగా నష్టపోయాయి. మరోవైపు, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 5 శాతానికి పైగా  లాభపడగా, నిఫ్టీ ఎఫ్ఎంసిజి ఇండెక్స్ 2.5 శాతంగా ఉంది.సన్ ఫార్మ టాప్ గెయినర్ గా నిలిచింది. ఐటీసీ,  లూపిన్, సిప్లా, గెయిల్ ఇండియా, భారత్ పెట్రోలియం, ఒఎన్‌జిసి, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్,  ఇండియన్ ఆయిల్ లాభపడ్డాయి. 

మరిన్ని వార్తలు