సిరీస్‌ లాభాల బోణి : కీలక స్థాయి ఎగువకి సూచీలు

28 Dec, 2018 15:45 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు  కొత్త జనవరి  ఎఫ్‌ అండ్‌ ఓ సిరీస్‌కు శుభారంభాన్నిచ్చాయి. ప్రపంచ మార్కెట్ల జోష్‌తో హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకూ అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. మొదటినుంచి 36వేల స్థాయిని నిలబెట్టుకున్న సెన్సెక్స్‌ ఒక దశలో 350 పాయింట్లకు పైగా ఎగిసింది. చివరికి 269పాయింట్లు ఎగసి 36,076 వద్ద నిఫ్టీ సైతం 80 పాయింట్లు పెరిగి 10,859వద్ద  ముగిసింది.  తద్వారా 10900 దిశగా నిఫ్టీ పయనిస్తోంది. 

అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా ఫార్మా, రియల్టీ, బ్యాంకింగ్‌  కౌంటర్లు లాభపడ్డాయి.  యూపీఎల్‌,  యస్‌బ్యాంక్‌, సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, టైటన్‌, టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, వేదాంతా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందాల్కో, ఎల్‌అండ్‌టీ  లాభాల్లో ముగియగా,  కోల్‌ ఇండియా, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఎన్‌టీపీసీ  స్వల్ప నష్టాలతో ముగిశాయి. 

మరిన్ని వార్తలు