స్టాక్‌మార్కెట్ల యూ టర్న్‌ : నష్టాల ముగింపు

29 Aug, 2018 15:43 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతోముగిశాయి. ఆరంభంనుంచిస్తబ్దుగా కదలాడిన కీలక సూచీలు ఇన్వెస్టర్ల అమ్మకాలతో మరింత నష్టపోయాయి.  లాభనష్టాల మధ్య సాగిన సెన్సెక్స్‌ చివరికి 174  పాయింట్లు పతనమై 38,722 వద్ద, నిఫ్టీ 47 పాయింట్ల నష్టంతో వద్ద ముగిసింది. తద్వారా కీలక మద్దతు స్థాయి 10700ను నిఫ్టీ కోల్పోయింది.

పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ, మెటల్‌ రంగాలు  లాభపడగా, ప్రయివేటు బ్యాంకులు,  మీడియా, ఐటీ  స్వల్పంగా నష్టపోయాయి. యూపీఎల్‌, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బీపీసీఎల్‌, టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ఎం, గెయిల్‌, సన్ ఫార్మా, బాష్‌, లాభాల్లోనూ, మరోపక్క కోల్‌ ఇండియా, పవర్‌గ్రిడ్‌, ఆర్‌ఐఎల్‌, ఐషర్‌, ఎస్‌బ్యాంక్‌ , ఇండస్‌ఇండ్, జీ, లుపిన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌, ఎన్‌టీపీసీ,   నష్టాల్లోనూ ముగిసాయి. దేశీ కరెన్సీ రూపాయి మరోసారి చరిత్రాత్మక కనిష్టానికి చేరడంపాటు,  గురువారం ఆగస్ట్‌ ఎఫ్‌అండ్‌వో గడువు ముగియనుండటం, రెండు రోజులపాటు మార్కెట్లు కొత్త గరిష్టాలకు చేరడం వంటి అంశాల కారణంగా ట్రేడర్లు లాభాల స్వీకరణకే మొగ్గు చూపినట్టు మార్కెట్‌ వర్గాలు విశ్లేషించాయి. 

మరిన్ని వార్తలు