నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు

29 Jan, 2019 14:00 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌అవుతున్నాయి. ప్రపంచ మార్కెట్లు బలహీనం నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు కూడా అదే బాట పట్టాయి.  ఆరంభంలో స్వల్ప నష్టాలతో ఉన్నా.మిడ్‌ సెషన్‌ తరువాత అమ్మకాల జోరు  224 పాయింట్లు పతనమై 35,432 వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు క్షీణించి 10,599 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. దీంతో వరుసగా మూడవ సెషనన్‌లో కూడా నష్టపోతున్నాయి.  

ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఫార్మా 1.2 శాతం చొప్పున బలపడగా.. ఐటీ 0.7 శాతం నీరసించింది.  అయితే  సోమవారం భారీగా నష్టపోయిన అదానీ గ్రూపు షేర్లు నేడు రీబౌండ్‌ అయ్యాయి.  ఐబీ హౌసింగ్‌ 5.5 శాతం పతనమైంది. ఇంకా యస్‌ బ్యాంక్‌, ఐషర్, ఇన్ఫోసిస్‌, గెయిల్‌, పవర్‌గ్రిడ్‌, ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌  టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.  మరోవైపు ఇన్‌ఫ్రాటెల్‌, బజాజ్‌ ఫిన్‌, సన్‌ ఫార్మా, డాక్డర్‌ రెడ్డీస్‌, సిప్లా, హీరో మోటో, బజాజ్‌ ఫైనాన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ  లాభాలతో కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు