మైనర్‌ బాలికపై లైంగిక దాడి

29 Jan, 2019 14:06 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానికి కూతవేటు దూరంలోని గుర్‌గావ్‌లో దారుణం చోటుచేసుకుంది. మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈనెల 24న పాఠశాలకు వెళుతున్న పదోతరగతి బాలికను స్కూల్‌ గేట్‌ వద్ద అడ్డగించిన నిందితుడు బాధితురాలిని బలవంతంగా తన కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు.

కాగా,మద్యం వ్యాపారం నిర్వహించే నిందితుడు జరిగిన విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బాలికను బెదిరించడంతో ఆమె తీవ్ర భయానికి లోనైందని మనేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ కాంతాదేవి వెల్లడించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్‌ చేశామని చెప్పారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు