స్వల్పంగా లాభపడ్డ సెన్సెక్స్

27 Jun, 2014 16:11 IST|Sakshi
స్వల్పంగా లాభపడ్డ సెన్సెక్స్
హైదరాబాద్: ఐటీ, హెల్త్ కేర్ రంగాల కంపెనీల షేర్లు మద్దతుగా నిలువడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు స్వల లాభాలతో ముగిసాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 37 పాయింట్ల లాభంతో 25099 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల వృద్దితో 7508 వద్ద ముగిసాయి. వారాంతపు ట్రేడింగ్ లో మెటల్, బ్యాంకింగ్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. 
 
సన్ ఫార్మా, టీసీఎస్, టెక్ మహీంద్ర, హెచ్ సీఎల్ టెక్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ లు 3 శాతానికి పైగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. యునైటెడ్ స్పిరిట్స్ అత్యధికంగా 3.33 శాతం నష్టపోగా, అల్ట్రా టెక్ సిమెంట్స్ 3.32, భెల్ 2.69, హిండాల్కో 2.63, భారతి ఎయిర్ టెల్ 1.99 శాతం నష్టపోయాయి. 
>
మరిన్ని వార్తలు