90 నిమిషాల్లో రూ 2 లక్షల కోట్లు..

4 Feb, 2020 16:20 IST|Sakshi

ముంబై : ముడిచమురు ధరలు తగ్గడం, గ్లోబల్‌ మార్కెట్ల ఊతంతో స్టాక్‌ మార్కెట్లు భారీగా లాభపడటంతో బడ్జెట్‌ నష్టాలను అధిగమించాయి. మార్కెట్లు ప్రారంభమైన 90 నిమిషాల్లోనే స్టాక్‌ జోరుతో మదుపుదారుల సంపద ఏకంగా రూ 2 లక్షల కోట్ల మేర పెరిగింది. ముడిచమురు ధరలు 13 నెలల గరిష్టస్ధాయికి పడిపోవడం, కరోనా వైరస్‌ భయాలు క్రమంగా తొలగుతుండటం మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. కొనుగోళ్ల జోరుతో అన్ని రంగాల షేర్లూ భారీగా లాభపడ్డాయి. ఐటీ, మెటల్‌, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, ఆటోమొబైల్‌, ఫార్మా సూచీలు పైపైకి ఎగిశాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 917 పాయింట్ల లాభంతో 40,789 పాయింట్ల వద్ద ముగియగా, 271 పాయింట్లు పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,979 పాయింట్ల వద్ద క్లోజయింది.

చదవండి : రుచించని బడ్జెట్‌, మార్కెట్లు ఢమాల్‌

మరిన్ని వార్తలు