సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా ముగిసిన భారత స్టాక్‌మార్కెట్లు

8 Nov, 2023 16:14 IST|Sakshi

భారత స్టాక్‌మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మంగళవారం ముగింపుతో పోలిస్తే 36 పాయింట్లు లాభపడి 19443కు చేరింది. అదే సెన్సెక్స్‌ 33 పాయింట్లు పుంజుకుని 64975 వద్ద స్థిరపడింది. 

అమెరికాలో వడ్డీరేట్లు గరిష్ఠ స్థాయిలకు చేరిన నేపథ్యంలో రానున్న ఏడాదిలో కీలక రేట్లను తగ్గిస్తారని మార్కెట్‌ భావించింది. కానీ ఫెడ్‌ నుంచి వెలువడిన సంకేతాల ప్రకారం అలాంటిదేమీ ఉండకపోవచ్చునని సమాచారం. ఈ తరుణంలో యూఎస్‌ సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడయ్యాయి. ఐరోపా మార్కెట్లు సైతం అదే బాటలో పయనించాయి. నేడు ఆసియా- పసిఫిక్‌ సూచీలు స్వల్ప లాభాలతోనే ప్రారంభమై చివరివరకు అదే దిశలో పయనించాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మంగళవారం రూ.497 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.700 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌30 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, జేఎస్‌డబ్ల్యూ, టైటాన్‌, ఎల్‌ అండ్‌ టీ, ఐటీసీ, హెచ్‌యూఎల్‌, మారుతి సుజుకీ లాభాల్లో ట్రేడయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిన్‌, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మరిన్ని వార్తలు