లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

1 Mar, 2019 09:50 IST|Sakshi

ముంబై : భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధమేఘాలతో కొద్ది రోజులుగా డీలా పడిన స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 200 పాయింట్లు పైగా లాభంతో 36వేల పాయింట్ల ఎగువన, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో 10వేల850 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

కొనుగోళ్ల మద్దతుతో కీలక రంగాల షేర్లు లాభపడుతున్నాయి. యస్‌ బ్యాంక్‌, అశోక్‌ లేలాండ్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభపడుతుండగా, భారతి ఎయిర్‌టెల్‌ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటోం‍ది. భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు సమసిపోవచ్చనే అంచనాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి.

మరిన్ని వార్తలు