కొత్త గరిష్టాల వద్ద మార్కెట్ల ముగింపు

16 Oct, 2017 15:43 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు  భారీ లాభాలతో ముగిశాయి.  భారీ లాభాలతో స్టాక్స్‌ మార్కెట్లో దీపావళి వెలుగులు విరజిమ్మాయి. బుల్‌ జోరుతో రికార్డ్‌ స్థాయిలను నమోదు చేసిన మార్కెట్లలో మిడ్‌ సెషన్‌ నుంచీ కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లు మరింత బలపడ్డాయి.  దీంతో సెన్సెక్స్‌ లాభాలతో డబుల్‌ సెంచరీ సాధించింది.  201 పాయింట్ల లాభంతో  32,634 వద్ద  ముగిసింది.  నిఫ్టీ సైతం 63 పాయింట్లు పుంజుకుని 10,230వద్ద  ముగిసింది. దాదాపు అన్ని రంగాలూ లాభపడగా.. మెటల్‌, ఆటో టెలికాం, రియల్టీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ  లాభాలు మార్కెట్లకు బలాన్నిచ్చాయి.
నిఫ్టీ దిగ్గజాలలో  ఫెడరల్‌బ్యాంక్‌, భారతి ఎయిర్‌టెల్‌, వేదాంతా,   ఎంఅండ్‌ఎం,  బాష్‌, హెచ్‌యూఎల్‌, సిప్లా, ఇన్‌ఫ్రాటెల్‌, టాటా మోటార్స్‌, సన్‌ ఫార్మా, లుపిన్‌,   బజాజ్‌ ఆటో, టాటా కమ్యూనికేషన్స్‌  ఐడియా, రిలయన్స్‌,  లాభపడగా,  సుందరం ఫైనాన్స్‌, సిమన్స్‌,  బజాజ్‌ ఫైనాన్స్,  ఇండస్‌ ఇండ్‌,  యాక్సిస్‌  బ్యాంక్‌,  యస్‌బ్యాంక్‌ , అదానీ పోర్ట్స్‌, మారుతీ, నష్టాల్లో ముగిశాయి.
అటు డాలర్‌ మారకంలో రుపీ  కూడా బాగా బలపడగా,  ఎంసీఎక్స్‌మార్కెట్లో బంగారం ధరలుమెరుపులు మెరిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు