బీఎస్‌ఈ లాభం హైజంప్‌

14 Nov, 2023 09:36 IST|Sakshi

న్యూఢిల్లీ: మార్కెట్‌ దిగ్గజం బొంబాయి స్టాక్‌ ఎక్ఛేంజ్‌ (బీఎస్‌ఈ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో నికర లాభం నాలుగు రెట్లు దూసుకెళ్లి రూ. 118 కోట్లను అధిగమించింది. ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది.

గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 29 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 53 శాతం జంప్‌చేసి రూ. 367 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 240 కోట్ల ఆదాయం సాధించింది. ఈక్విటీ విభాగంలో రోజువారీ సగటు టర్నోవర్‌ రూ. 4,740 కోట్ల నుంచి రూ. 5,922 కోట్లకు ఎగసింది.

రైట్స్‌ ఇష్యూ ద్వారా ఇండియా ఇంటర్నేషనల్‌ ఎక్సే్ఛంజ్‌(ఐఎఫ్‌ఎస్‌సీ) లిమిటెడ్‌(ఇండియా ఐఎన్‌ఎక్స్‌)లో రూ. 22.36 కోట్లు, ఇండియా ఇంటర్నేషనల్‌ ఎక్సే్ఛంజ్‌(ఐఎఫ్‌ఎస్‌సీ) లిమిటెడ్‌(ఇండియా ఐసీసీ)లో రూ. 33.88 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసేందుకు బోర్డు అనుమతించినట్లు బీఎస్‌ఈ వెల్లడించింది.  

మరిన్ని వార్తలు