లాభాలకు చెక్‌: నష్టాల ముగింపు

28 Aug, 2019 15:51 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  నష్టాల్లో ముగిసాయి. రోజంతా నష్టాలతో సాగిన  సూచీలు చివర్లో స్వల్పంగా పుంజుకున్నా చివరికి నష్టాల్లోనే స్థిరపడ్డాయి. ఒక దశలో 360 పాయింట్లకు కోల్పోయిన  సెన్సెక్స్‌ 189  పాయింట్లకు నష్టాలను కుదించుకుంది. నిఫ్టీ కూడా ఆఖరి గంటలో కోలుకుని 59 పాయింట్లు నష్టాలకు పరిమితమై 11046 వద్ద పటిష్టంగా ముగిసింది. ఐటీ తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. ప్రధానంగా  బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. బ్యాంకులలో ఐడీబీఐ, ఆర్‌బీఎల్‌, యస్‌ బ్యాంకు భారీగా నష్టపోయాయి. ఇంకా టాటా స్టీల్‌, జెఏస్‌డబ్ల్యూ, టాటా మోటార్స్‌,  వేదాంతా ఓఎన్‌జీసీ టాప్‌ లూజర్స్‌గా నిలవగా  హెచ్‌సీఎల్‌, ఇన్ఫోసిస్‌, హెచడీఎఫ్‌సీ, టీసీఎస్‌, ఆసియన్‌ పెయింట్స్‌, భారతి ఎయిర్‌టెల్‌  టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు