పాపం రాహుల్‌ ఇలా బుక్కవుతున్నాడేంటి!?

28 Aug, 2019 15:35 IST|Sakshi

తిరువనంతపురం: కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీకి ఓ వింత అనుభవం ఎదురయ్యింది. ఓ అభిమాని రాహుల్‌ గాంధీకి ముద్దు పెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. రాహుల్‌ వయనాడ్‌ నియోజకవర్గ పర్యటనలో ఉండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు.. బుధవారం రాహుల్‌ గాంధీ వయనాడ్‌లో పర్యటించారు. ఆ సమయంలో ఓ అభిమాని రాహుల్‌ వాహనం దగ్గరకు వచ్చి తొలుత షేక్‌హ్యాండ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత రాహుల్‌ చేయి పట్టుకుని లాగి అతని బుగ్గపై ముద్దు పెట్టి అంతేవేగంగా వెళ్లి పోయాడు. ఈ అనూహ్య సంఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు రాహుల్‌. కానీ వెంటనే తేరుకుని ఆ తర్వాత వచ్చిన వారిని పలకరించాడు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఇలాంటే పరిస్థితి ఎదురయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌ గుజరాత్‌లో పర్యటించినప్పుడు ఓ మహిళ అతడిని ముద్దు పెట్టుకుంది. రాహుల్‌ మెడలో పూలమాల వేయడానికి స్టేజీ మీదకు వచ్చిన సదరు మహిళ ఒక్కసారిగా అతని బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్లి పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలయిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా లవర్స్‌ డే రోజున ఈ వీడియోను విపరీతంగా షేర్‌ చేశారు నెటిజనులు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు