ఎంజీ మోటార్‌ నుంచి  ‘ఎస్‌యూవీ హెక్టర్‌’..!

10 Jan, 2019 04:26 IST|Sakshi

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ఎస్‌ఏఐసీ మోటార్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు భారత అనుబంధ సంస్థ అయిన ఎంజీ మోటార్‌ ఇండియా త్వరలోనే స్పోర్ట్‌–యుటిలిటీ వెహికల్‌ (ఎస్‌యూవీ)ను విడుదలచేయనుంది. ‘హెక్టర్‌’ పేరుతో ఈఏడాది మధ్యనాటికి కారు విడుదలకానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ చబా మాట్లాడుతూ... ‘ఎస్‌యూవీ విభాగం ఇప్పుడు భారత్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది.

ఇక్కడి వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా భారీస్థాయిలో ఈ కారును ఇంజనీరింగ్‌ చేయగలిగాం. ఈ ఎస్‌యూవీ పూర్తిగా కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఉంటుందని భావిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఈ కారు ఉత్పత్తి నిమిత్తం గుజరాత్‌లోని హలోల్‌ ప్లాంట్‌లో రూ.2,000 కోట్లను పెట్టుబడి పెట్టిన ఈ కంపెనీ.. వచ్చే ఐదేళ్లలో రూ.5,000 కోట్లకు పెట్టుబడిని పెంచనున్నట్లు తెలిపింది. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏడేళ్లలో వేయి విమానాలు..

వచ్చే నెల్లో శాంసంగ్‌ ‘గెలాక్సీ ఎం సిరీస్‌’ విడుదల..!

భారీగా పెరిగిన పీఈ, వీసీ పెట్టుబడులు

పడేసిన పారిశ్రామిక గణాంకాలు

మళ్లీ మార్కెట్లోకి లాంబ్రెటా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విక్రమ్‌ న్యూ లుక్‌.. వైరల్‌ అవుతున్న టీజర్‌

ప్రియా ప్రకాశ్‌కు షాకిచ్చిన బోనీ కపూర్‌

అవకాశం వస్తే నేనోద్దంటానా?

వైరలవుతోన్న ఆశాభోస్లే ట్వీట్‌

ఇంట్లో ఇల్లాలు... గ్రౌండ్‌లో ప్రియురాలు

‘మున్నాభాయ్‌’ నటుడు అదృశ్యం.. మూడేళ్లయినా