ఎస్‌బీఐ లైఫ్‌–సిండికేట్‌ బ్యాంక్‌ జట్టు

3 Jan, 2019 01:37 IST|Sakshi

బ్యాంక్‌ అష్యూరెన్స్‌ ఒప్పందం

బెంగళూరు: సిండికేట్‌ బ్యాంక్, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ల మధ్య బ్యాంక్‌అష్యూరెన్స్‌ ఒప్పందం కుదిరింది. ఖాతాదారులకు సమగ్రమైన ఫైనాన్షియల్‌ ప్లానిం గ్‌ సొల్యూషన్‌ను అందించడానికి ఈ ఒప్పం దం కుదు ర్చుకున్నట్లు ఇరు సంస్థలు వెల్లడించాయి. ఈ ఒప్పందంపై సిండికేట్‌ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ మృత్యుంజయ్‌ మహాపాత్ర, ఎస్‌బీఐ లైఫ్‌  సీఈఓ, ఎమ్‌డీ సంజీవ్‌ నౌతియాల్‌ సంతకాలు చేశారు. దేశవ్యాప్తంగా 3,000 బ్రాంచ్‌లతో సేవలందిస్తున్న సిండికేట్‌ బ్యాంక్‌ తన బ్రాంచ్‌ల ద్వారా ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు చెందిన పాలసీలను విక్రయిస్తుంది. 

ఎసాప్స్‌ ద్వారా రూ.500 కోట్లు... 
ఎంప్లాయీ స్టాక్‌ పర్చేజ్‌ స్కీమ్‌ (ఎసాప్స్‌) కింద ఉద్యోగులకు షేర్లు జారీ చేసి రూ.500 కోట్లు సమీకరించనున్నామని సిండికేట్‌ బ్యాంక్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు