ఎగుమతులు... రెండో నెలా పెరిగాయ్

16 Nov, 2016 01:04 IST|Sakshi
ఎగుమతులు... రెండో నెలా పెరిగాయ్

అక్టోబర్‌లో 9.59 శాతం వృద్ధి; 23.5 బిలియన్ డాలర్లు
వాణిజ్య లోటు 10.16 బిలియన్ డాలర్లు 

న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు వరుసగా రెండవ నెలలోనూ సానుకూల ఫలితాన్ని అందించారుు. వార్షికంగా చూస్తే... అక్టోబర్‌లో 9.59 శాతం వృద్ధి నమోదరుు్యంది. విలువ 23.51 బిలియన్ డాలర్లు. ఆభరణాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు పెరగడం మొత్తం గణాంకాల మెరుగుకు కారణమరుు్యంది.  ఇవే రంగాల దన్నుతో సెప్టెంబర్‌లో ఎగుమతుల వృద్ధి 4.62 శాతం (22.9 బిలియన్ డాలర్లు)గా నమోదరుున సంగతి తెలిసిందే. మంగళవారం అక్టోబర్ నెలకు సంబంధించి అధికారిక లెక్కలు విడుదలయ్యారుు. 

వార్షికంగా వివిధ రంగాల తీరు...
ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతుల్లో వృద్ధి 13.86 శాతం నమోదరుు్యంది. 

రత్నాలు, ఆభరణాల విభాగంలో ఎగుమతుల వృద్ధి 21.84 శాతం.

పెట్రోలియం విషయంలో ఇది 7.24 శాతంగా ఉంది.

రసాయనాల ఎగుమతుల వృద్ధి 6.65 శాతం.

దిగుమతులు 8.11 శాతం వృద్ధి...

ఇక అక్టోబర్‌లో దేశం దిగుమతులను చూస్తే... 8.11 శాతం వృద్ధి నమోదరుు్యంది. విలువ రూపంలో ఇది 33.67 బిలియన్ డాలర్లు. వెరసి ఎగుమతి-దిగుమతి విలువ మధ్య వాణిజ్య లోటు 10.16 బిలియన్ డాలర్లుగా నమోదరుు్యంది. చమురు దిగుమతులు అక్టోబర్‌లో 3.98% పెరిగి 7.14 బిలియన్ డాలర్లుగా నమోదయ్యారుు. చమురుయేతర దిగుమతుల విలువ 9.28 శాతం ఎగసి 26.53 బిలియన్ డాలర్లుగా ఉంది.

 ఏడు నెలల్లో...: కాగా ఆర్థిక సంవత్సరం ఏడు నెలల కాలంలో (ఏప్రిల్-అక్టోబర్) గత ఏడాది ఇదే కాలంతో చూస్తే... ఎగుమతుల్లో అసలు వృద్ధి లేకపోగా -0.17 శాతం క్షీణించారుు. విలువ 155 బిలియన్ డాలర్లుగా నమోదరుు్యంది. దిగుమతులు కూడా -11 శాతం పడిపోయారుు. వీటి విలువ 208 బిలియన్ డాలర్లుగా ఉంది. వెరసి వాణిజ్యలోటు 53.16 బిలియన్ డాలర్లుగా ఉంది.

 దేశ ఎగుమతుల ధోరణి ఇదీ...
2014 డిసెంబర్ నుంచి 2016 మే వరకూ వరుసగా 18 నెలలు భారత్ ఎగుమతులు క్షీణిస్తూ వచ్చారుు. బలహీన గ్లోబల్ డిమాండ్, చమురు దిగుమతుల పతనం దీనికి కారణం. అరుుతే ఈ ఏడాది జూన్ నెలలో వృద్ధి కనబడినా... మరుసటి రెండు నెలలూ జూలై-ఆగస్టుల్లో ఎగుమతులు మళ్లీ క్షీణతలో పడ్డారుు. తిరిగి గడచిన రెండు నెలలో వృద్ధిలోకి మారారుు.

మరిన్ని వార్తలు