యాప్ ట్రేడింగ్ పై ఎడల్ వైజ్ దృష్టి

5 Feb, 2016 02:32 IST|Sakshi
యాప్ ట్రేడింగ్ పై ఎడల్ వైజ్ దృష్టి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ట్రేడింగ్‌పై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు  ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ఎడల్‌వైజ్ ప్రకటించింది. చాలా సులభంగా ట్రేడింగ్ చేసుకునే విధంగా ఈమధ్యనే అభివృద్ధి చేసిన యాప్‌కు మంచి డిమాండ్ వస్తోందని ఎడల్‌వైజ్ గ్లోబల్ హెల్త్ మేనేజమెంట్ రిటైల్ హెడ్ రాహుల్ జైన్ తెలిపారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా కలిసిన విలేకరులతో మాట్లాడుతూ వచ్చే మూడు నెలల్లో లక్షమంది ఖాతాదారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఎడల్‌వైజ్ ఖాతాదారుల సంఖ్య 3 లక్షలుండగా అందులో ఇప్పటి వరకు 30,000 మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. మొబైల్ ట్రేడింగ్ పెరుగుతోందని, గత మూడేళ్లుగా మొబైల్ ట్రేడింగ్‌లో 100% చొప్పున వృద్ధి నమోదైనట్లు తెలిపారు. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులున్నా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో ఈక్విటీలు 13 నుంచి 14% సగటు రాబడులను అందిస్తుందని అంచనా వేస్తున్నట్లు జైన్ తెలిపారు.

>
మరిన్ని వార్తలు