డేంజర్‌ యాప్స్‌.. మీ ఫోన్‌లో ఇప్పుడే తొలగించండి..

8 Dec, 2023 20:30 IST|Sakshi

వినియోగదారుల సమాచార భద్రతకు ముప్పుగా పరిణమించిన పలు మొబైల్‌ యాప్‌లను గూగుల్‌ ఇటీవల తన ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఈసెట్‌(ESET) ఈ ఏడాది గూగుల్‌ ప్లేస్టోర్‌లో 18 లోన్‌ యాప్‌లను స్పైలోన్‌ యాప్‌లుగా గుర్తించింది. 

కోట్లాది డౌన్‌లోడ్స్‌ ఉన్న ఈ లోన్‌యాప్‌లు వినియోగదారుల ఫోన్‌ల నుంచి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ సమాచారాన్ని రుణగ్రహీతలను బ్లాక్‌మెయిల్ చేసి అధిక వడ్డీ రాబట్టడానికి దుర్వినియోగం చేస్తున్నాయి. ఇటువంటి యాప్‌లకు సంబంధించిన వివరాలను ఈసెట్‌ పరిశోధకులు తెలియజేశారు. 
ఈ యాప్‌లు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాలోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. 

ఈసెట్‌ గుర్తించిన  18 డేంజర్‌ యాప్‌లలో 17 యాప్‌లను గూగుల్‌ ఇప్పటికే తొలగించింది. ఒకటి మాత్రం ఇప్పటికీ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. అయితే ఇది యాక్టివ్‌ స్థితిలో లేదు. గూగుల్‌ ప్లేస్టోర్‌లో తొలగించిన ఈ యాప్‌ను ఇక్కడ ఇస్తున్నాం.. ఇవి మీ మొబైల్‌ ఫోన్‌లో ఉంటే ఇప్పుడే తొలగించండి..

డేంజర్‌ యాప్స్‌ ఇవే..

  • ఏఏ క్రెడిట్‌ (AA Kredit)
  • అమోర్‌ క్యాష్‌ (Amor Cash)
  • గేయబాక్యాష్‌ (GuayabaCash)
  • ఈజీ క్రెడిట్‌ (EasyCredit)
  • క్యాష్‌వావ్‌ (Cashwow)
  • క్రెడిబస్‌ (CrediBus)
  • ఫ్లాష్‌లోన్‌ (FlashLoan)
  • ప్రెస్టమోస్‌క్రెడిటో (PréstamosCrédito)
  • ప్రెస్టమోస్ డి క్రెడిట్-యుమికాష్ (Préstamos De Crédito-YumiCash)
  • గో క్రెడిటో (Go Crédito)
  • ఇన్స్టంటానియో ప్రెస్టమో (Instantáneo Préstamo)
  • కార్టెరా గ్రాండే (Cartera grande)
  • రాపిడో క్రెడిటో (Rápido Crédito)
  • ఫైనప్ లెండింగ్ (Finupp Lending)
  • ఫోర్‌ఎస్‌ క్యాష్‌ (4S Cash)
  • ట్రూనైరా (TrueNaira)
  • ఈజీ క్యాష్‌ (EasyCash)

ఇది కూడా చదవండి: టెక్‌ ప్రపంచంలో సంచలనం.. ఈ యేటి మేటి సీఈవో ఈయనే..

>
మరిన్ని వార్తలు