రూ.55 లక్షలకే 267 గజాల్లో విల్లా!

20 Jan, 2018 02:22 IST|Sakshi

బానూరులో లైఫ్‌ స్టయిల్‌ డ్రీమ్‌ హోమ్స్‌

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో సొంతిల్లు అదీ ఇండిపెండెంట్‌ హౌస్, విల్లా అంటే మామూలు విషయం కాదు. కోట్లు వెచ్చించక తప్పదు. కానీ, నగరంలోని అపార్ట్‌మెంట్‌ ధరకు ఏకంగా ప్రీమియం విల్లాలను అందిస్తోంది చీడెల్లా హౌజింగ్‌. ప్రాజెక్ట్‌ విశేషాలను సంస్థ ఎండీ నాగమణేశ్వర్‌ గుప్తా ‘సాక్షి రియల్టీ’తో పంచుకున్నారు.

పటాన్‌చెరు–శంకర్‌పల్లి Ðð ళ్లే మార్గంలోని బానూరులో 34 ఎకరాల్లో లైఫ్‌ స్టయిల్‌ డ్రీమ్‌ హోమ్స్‌ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన ఈ వెంచర్‌లో మొత్తం 360 విల్లాలుంటాయి. ఇప్పటికే 220 విల్లాల నిర్మాణం పూర్తయింది కూడా. 180 గజాల్లో 900 చ.అ.ల్లోని విల్లా ధర రూ.40 లక్షలు, 267 గజాల్లో 1,232 చ.అ.ల్లోని విల్లా ధర రూ.55 లక్షలు, 333 గజాల్లో 1,550 చ.అ.ల్లోని విల్లా ధర రూ.65 లక్షలు.  
 ఈ ప్రాజెక్ట్‌లో 30 వేల చ.అ.ల్లో వాణిజ్య సముదాయాన్ని నిర్మించాం. దీన్ని కార్యాలయాలు, బ్యాంక్, స్కూలు, ఆసుపత్రి వంటి వాటికి కేటాయిస్తాం. 18 వేల చ.అ.ల్లో క్లబ్‌ హౌస్‌తో పాటూ స్విమ్మింగ్‌పూల్, జిమ్, ఫంక్షన్‌ హాల్‌ వంటివి కూడా ఉంటాయి. ఆయా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

విల్లాల మధ్యలో ఓపెన్‌ ప్లాట్లు..
తూర్పు వైపు విల్లాలు, పశ్చిమం వైపు ఓపెన్‌ ప్లాట్లు ఉండడమే లైఫ్‌ స్టయిల్‌ డ్రీమ్‌ హోమ్స్‌ ప్రాజెక్ట్‌ ప్రత్యేకత. ఇందులో 180, 267, 333 గజాల్లో మొత్తం 120 ప్లాట్లుంటాయి. ధర గజానికి రూ.13,500. ఇప్పటికే 70 శాతం అమ్మకాలు పూర్తయ్యాయంటే ప్రాజెక్ట్‌ నిర్మాణం, స్థానిక అభివృద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
  నందిగామలో రాయల్‌ ప్రైడ్‌ పేరిట 18 ఎకరాల లే అవుట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో 290 ప్లాట్లుంటాయి. ధర గజానికి రూ.10 వేలు. నర్సాపూర్‌ రోడ్‌లోని అన్నారంలో 9 ఎకరాల్లో మరో లే అవుట్‌ను ప్రారంభించనున్నాం. హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన ఈ వెంచర్‌ను వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించనున్నాం.
 అక్టోబర్‌ నాటికి 80 ఎకరాల్లో మరో 2–3 వెంచర్‌లను అభివృద్ధి చేయాలని లకి‡్ష్యంచాం. ఇప్పటివరకు బెంగళూరు హైవేలోని కొత్తూరు, గండిమైసమ్మ ప్రాంతాల్లో 40 ఎకరాల్లో 4 ప్రాజెక్ట్‌లను పూర్తి చేశాం.

మరిన్ని వార్తలు