అద్భుత ఫీచర్లతో ప్రపంచంలోనే తొలి సూపర్‌ ల్యాప్‌టాప్‌​

14 Jun, 2018 15:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  చైనీస్‌ తయారీదారు లెనోవా  అద్భుత ఫీచర్లతో  ఒక ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేసింది. ప్రపంచంలోనే అత్యధిక  స్టోరేజ్‌ కెపాసిటీతో తొలి డివైస్‌నువిడదుల చేసింది.  థింక్‌ప్యాడ్‌ పీ 52 పేరుతో  లాంచ్‌ చేసింది. వర్చువల్‌ రియాల్టీ సామర్థ్యాలతో 128 జీబీ ర్యామ్‌, 6టీబీ స్టోరేజ్‌ కెపాసిటీతో దీన్ని ప్రవేశపెట్టింది. జూన్‌ చివరినాటికి వినియోగదారులకు అందుబాటులోకి రానున్న ఈ ల్యాప్‌టాప్‌ ధర  సుమారు రూ.81 వేల నుంచి ప్రారంభమవుతుంది.

లెనోవా థింక్‌ప్యాడ్‌ పి52 ఫీచర్లు
15.6 అంగుళాల 4కె టచ్‌ స్క్రీన్‌ డిస్‌ ప్లే
1920x1080 పిక్సెల్ రిసల్యూషన్‌
8 వ జనరల్ ఇంటెల్ జియోన్ హెక్సా-కోర్ ప్రాసెసర్
 2.5 కిలోగ్రాముల బరువు

కనెక్టివిటీ పరంగా ఇందులో  యూఎస్‌బీ 3.1 టైప్-ఎ, రెండు: యూఎస్‌బీ- సి / థండర్‌ బోల్డ్‌, ఒక హెచ్‌డీఎంఐ 2.0, ఒక మినీ డిస్‌ప్లేపోర్ట్ 1.4, ఎస్‌డీ కార్డ్ రీడర్‌ను అందిస్తుంది. అంతేకాదు ఈ ల్యాప్‌టాప్లో ఐదు ఆపరేటింగ్ సిస్టమ్స్‌ ఆప్షన్స్‌  ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. విండోస్ 10 ప్రో, విండోస్ 10 ప్రో, విండోస్ 10 హోమ్, ఉబూన్‌-2 మరియు లైనక్స్ కోసం విండోస్ 10 ప్రో, ఐదు ఆపరేటింగ్ సిస్టమ్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే ఇందులోని ఇన్‌ఫ్రారెడ్ కెమెరా (ఫేస్‌ రికగ్నిషన్‌ వీడియో కాలింగ్ కోసం హెచ్‌డీ వెబ్‌ కెమెరాలా ఉపయోగపడుతుంది.

మరిన్ని వార్తలు