ఫలితాల దెబ్బ : ఎస్‌బ్యాంకు షేరు పతనం

30 Apr, 2019 14:40 IST|Sakshi

సాక్షి,ముంబై:  ప్రయివేటు రంగ బ్యాంకు ఎస్‌ బ్యాంకునకు ఫలితాల సెగ  భారీగా తాకింది. మార్చి30తో ముగిసిన గత ఏడాది నాలుగవ త్రైమాసిక ఫలితాలు  ప్రకటనతో ఎస్‌ బ్యాంకు కౌంటర్లో అమ్మకాల వెల్లువెత్తింది. దీంతో ఏకంగా  షేరు 30శాతం కుప్పకూలింది.  2005 తర్వాత  ఎస్‌ బ్యాంక్‌ ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. 

 బ్యాడ్‌లోన్ల బెడదతో త్రైమాసికంలో 1506 కోట్ల రూపాయలను నికర నష్టాలను చవి చూసింది.  అయితే గత  ఏడాదితో పోలిస్తే ఆదాయం 16.29శాతం పుంజుకుని రూ. 2505 కోట్లు సాధించింది. ప్రొవిజన్లు 9 రెట్లు ఎగబాకి రూ.3661 కోట్లగా ఉన్నాయి. గత ఏడాది ఇదే క్వార్టర్లో ఇది రూ.399 కోట్లు మాత్రమే.

మరిన్ని వార్తలు