నలుగురు మలేషియన్ల అరెస్ట్‌

30 Jan, 2018 20:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సింగపూర్ ‌: మలేసియా నుంచి సింగపూర్‌కు నిషేధిత సిగరెట్లను అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వేకువజామున ఉడ్‌ల్యాండ్స్‌ చెక్‌పోస్టు వద్ద వీరిని అరెస్టు చేసినట్లు సింగపూర్‌ కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. నిషేధిత సిగరెట్లను సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో మలేసియా నుంచి వచ్చే వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు.

తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో ఒక ట్రక్కులో సిగరెట్లను ఇమిగ్రేషన్‌ అధికారి గుర్తించారని చెప్పారు. సింగపూర్‌ కస్టమ్స్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు తనిఖీలు చేపట్టి మరో రెండు వాహనాల్లో సిగరెట్లు ఉన్నట్లు గుర్తించారు. మూడు ట్రక్కులను సీజ్‌ చేసి, నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. అక్రమంగా తరలిస్తున్న సిగరెట్ల విలువ దాదాపు మూడున్నర లక్షల డాలర్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. మలేసియాలో నిషేధిత వస్తువులను విక్రయించినా, కొనుగోలు చేసినా చట్ట రీత్యా నేరం. దోషులుగా తేలిన వారికి ఆరేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు