'ఒంటరితనం' రోజుకు 15 సిగరెట్లు తాగినంత ప్రాణాంతకమా? వెలుగులోకి షాకింగ్‌ విషయాలు

31 Oct, 2023 11:56 IST|Sakshi

ఒంటరితనం అదొక రకమైన వ్యాధి అని ఎందరో వైద్యులు చెబుతున్నారు. మానసిక వ్యాధిలా మొదలై దీర్థకాలికి వ్యాధులు చుట్టుముట్టేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు. పరిశోధకులు జరిపిన అధ్యయనంలో సిగరెట్లు తాగితే ఎంత ప్రమాదమో! అంత ప్రాణాంతకం అని హెచ్చరిస్తున్నారు. నిజానికి ఒంటరితనం అంత ప్రాణాంతకమా? ఏకంగా ధూమపానం తాగడంతో పోల్చడానికి కారణం ఏంటీ?.. తదితరాల గురించే ఈ కథనం!.

ఒంటరితనం ఒంటరిగా ఉండటం అంటే..
ఒంటరితనం, ఒంటిరిగా అనే పదాలు ఒకేలా ఉన్నా రెండింటికి చాలా తేడా ఉంది. మనకు మనంగా కోరుకుని ఒంటరిగా ఉండటాన్ని ఏకాంతంగా గడపటంగా భావించొచ్చు. ఇష్టపూర్వకంగా నీతో నీవు గడపటం లాంటిది. ఇది ఆరోగ్యానికి ఒకరకంగా మంచిదే. మిమ్మల్ని మీరు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఒకరకంగా మీ భావోద్వేగాలను నియంత్రించుకునే ఓ గొప్ప అవకాశం.

అదే ఒంటరితనం అంటే.. మన చుట్టూ ఎంతమంది ఉన్నా ఏదో లేదనే భావన ఉండటం. తనకంటూ ఎవ్వరూ లేరని ఫీలవుతుండటం ఒంటిరితనం కిందకు వస్తుంది. ఇది మనిషిని కుంగదీస్తుంది. చూడటానికి సాధారణంగా అనిపించినా.. ఓ భయానక వ్యాధి. చివరికి మనిషిని చనిపోయేలా కూడా ప్రేరేపిస్తుంది. అందుకనే వైద్యలు, ఆరోగ్య నిపుణులు ఒంటరితనం ప్రాణాంతకమైనదని పదేపదే ప్రజలను హెచ్చరిస్తున్నారు. 

పరిశోధనలే ఏం చెబుతున్నాయంటే
శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన అధ్యయనంలో మంచి రిలేషన్‌షిప్స్‌ మెయింటైన్‌ చేసిన వాళ్ల కంటే ఒంటరితనంతో బాధపడే వ్యక్తులు అకాల మరణానికి 50% ఎక్కువ ఉందని వెల్లడైంది. ఈ ఒంటరితనం ధూమపానం తాగినంత ‍ప్రమాదకరమైనదని పేర్కొంది. రోజుకి 15 సిగరెట్లు తాగితే ఎంత ప్రాణాంతకం అంత ప్రమాదకరమైనది ఒంటిరితనం అని వెల్లడించింది. దీనివల్ల రోజువారి జీవనంపై ప్రభావం ఏర్పడి దీర్ఘకాలిక గుండె జబ్లులు వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

ఈ డిప్రెషన్‌ కారణంగా చాలామంది ఒబెసిటీ సమస్యను ఎదర్కొంటున్నట్లు అధ్యయనంలో తేలింది. అందుకోసం అని ఓ మెడిల్‌ ఆస్పత్రిలోని దీర్ఘకాలిక సమస్యలతో ఒంటరితనంతో బాధపడుతున్న కొంతమంది రోగులపై అధ్యయనం చేయగా..వారు కొంత సేపు తమతో ఆరోగ్యం గురించి మాట్లాడారు. ఆ తర్వాత వారి వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఎప్పటికప్పుడూ వారిని పర్యవేక్షిస్తూ వారితో స్నేహంగా మెలిగారు.

వారు కూడా తెలియకుండానే వారితో కనెక్ట్‌ అయ్యి తమ భావోద్వేగాలన్నింటిని షేర్‌ చేసుకున్నారు. వాళ్లికి ఎవ్వరితోనైనా కాసేపు మాట్లాడితే తెలియని ఆనందం ఉంటుందనేలా ఆ రోగులకు అవగాహన కల్పించారు. ఆ తర్వాత ఆ రోగులు డిశ్చార్జ్‌ అయ్యాక కూడా వారి పరిస్థితి గురించి ఎప్పటికప్పుడూ ట్రాక్‌ చేస్తూనే ఉన్నారు పరిశోధకులు. ఐతే వారిలో మార్పు వచ్చి మనుషులతో కనెక్ట్‌ అవ్వడం ప్రారంభించారు. అలాగే ఆ రోగులు ఆస్పత్రిని సందర్శించడం కూడా తగ్గింది.

ఎందుకు హానికరం అంటే..
తనకంటూ ఎవ్వరూ లేరనే వ్యథ ఆవరించి మనిషిని ఒక విధమైన సోమరి లేదా చేతకాని వాడిగా మార్చేస్తుంది. తెలియని నిరుత్సాహం వచ్చేస్తుంది. చిన్న పనులు కూడా భారంగా ఉంటాయి. అది క్రమేణ ఆ వ్యక్తిని మంచానికే పరిమితమై ఓ భయానక వ్యాధిలా మారిపోతుంది. ఏం లేకుండానే ఏదో మహమ్మారి బారినపడ్డవాడిలా త్వరతగతిన మృత్యు ఒడిలోకి వెళ్లిపోతాడు. ఇలాంటి వాళ్లు తాను నిర్లక్ష్యానికి గురవ్వుతున్నా అనే భావం నుంచి మొదలై ఎవ్వరితోనూ సంబంధాలు నెరుపుకోలేక ఇబ్బంది పడతారు. మొదట ఆ భావన తొలగించి తనకు నచ్చినా లేదా తనంటే ఇష్టపడే వ్యక్తులతో గడుపూతూ మంచి సంబంధాలను నెరుపుకుంటూ పోతే మనల్ని వద్దనుకున్నవాళ్లు సైతం మనతో చేయి కలిపేందుకు ముందుకు వస్తారు. చిత్త వైకల్యం అన్నింటికంటే ప్రమాదకరమైంది. అది బాగుంటే అన్ని బాగున్నట్లే. 

అలాగే రిలేషన్స్‌లో క్యాలిటీ ముఖ్యం
వందల సంఖ్యలో రిలేషన్స్‌ ఏర్పర్చుకోనవసరం లేదు. మనం అంటే ఇష్టపడే వ్యక్తి ఒక్కరైనా చాలు. మనకు వారి వద్ద స్వాంతన దొరికితే చాలు. నచ్చిన స్నేహితుడు లేదా మీ శ్రేయోభిలాషి/మన అనుకునులే మనం మంచి కోరే వ్యక్తి ఉంటే చాలు. అందుకే ఇక్కడ మీరు ఎవరితో సన్నిహితంగా ఉంటారో వారితో మంచి నాణ్యతతో కూడిన బాండింగ్‌ ఏర్పర్చుకుంటే చాలు. తెలియకుండానే అన్ని రుగ్మతల నుంచి బయటపడతారు.

ఆ తర్వాత మీకు మీరుగా ఏదోక వ్యాపకం ఏర్పరుచుకుని ధైర్యంగా జీవితాన్ని గడపగలిగే మనోధైర్యం వచ్చేస్తుంది. చింతకు చోటు ఇవ్వదు అది మీ చిత్తాన్ని చెదిరిపోయేలా చేసి కుంగదీస్తుంది. మీకు కాస్త ఒంటరితనంగా ఫీలయితే వెంటనే సోషల్‌ మీడియాలో లేదా దేవాలయానికో లేదా నచ్చిన ప్రదేశానికి వెళ్లండి కొత్త మనుషులు పరిచయలు ఏర్పడి మీకో కొత్త ఉత్తేజాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ఇటీవల ఈ కరోనా మహమ్మారి తర్వాత నుంచే ఈ ఒంటరితనం సమస్య ఎక్కువైంది. ముఖ్యంగా అమెరికా వంటి దేశాల ఈ సమస్య మరింత ఎక్కువ ఉంది. 

(చదవండి: కోవిడ్‌కి గురైతే గుండె సమస్య తప్పదా? ఆరోగ్య మంత్రి షాకింగ్‌ వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు