ఐదేళ్ల చిన్నారి హత్య.. తల్లి మీద పగతో పొరుగింటి మహిళ ఘాతుకం

20 Nov, 2023 15:49 IST|Sakshi

ముజఫర్‌నగర్: పొరుగింటి మహిళపై పగతో ఆమె ఐదేళ్ల కొడుకుని హతమార్చిన మహిళను ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వివరాల్లోకి వెళ్తే...

ముజఫర్‌నగర్ జిల్లాలో తేవ్రా గ్రామానికి చెందిన ఆసిఫా అనే మహిళ.. పొరిగింట్లో ఉంటున్న దినిస్టా బేగంపై పగతో ఆమె ఐదేళ్ల కుడుకు అర్సలాన్‌ని కిడ్నాప్‌ చేసి హత్య చేసింది. నవంబర్ 11న బాలుడు అదృశ్యం కాగా మూడు రోజుల తరువాత కక్రౌలీ పోలీసు స్టేషన్‌ పరిధిలోని గ్రామ శివార్లలో అడవిలో  గోనె సంచిలో అర్సలాన్‌ మృతదేహం లభ్యమైంది.

అర్సలాన్‌ను హత్య చేసినట్లు విచారణలో  అసిఫా అంగీకరించిందని కేసు దర్యాప్తు చేస్తున్న సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బయట ఆడుకుంటున్న అర్సలాన్‌ను ఆసిఫా కిడ్నాప్ చేసి తన ఇంట్లో బంధించింది. గ్రామమంతా వెతికిన బాలుడి తండ్రి షాజాద్ ఖాన్ ఆచూకీ దొరక్కపోవడంతో కక్రౌలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు గ్రామశివార్లలో బాలుడి మృతదేహాన్ని గుర్తించి గుర్తు తెలియని వ్యక్తి హత్య చేసినట్లుగా కేసు నమోదు చేశారు. తర్వాత ఆసిఫా ఇంట్లో బాలుడి టోపీ, చెప్పులు, గొంతుకు బిగించేందుకు ఉపయోగించిన తాడును స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాను తమదైన శైలిలో పోలీసులు విచారించగా బాలుడిని చంపింది తానే అని ఒప్పుకుంది. అర్సలాన్‌ తల్లి దనిస్టా బేగం తనను అగౌరవంగా చూసేదని, తరచూ అవమానించేదని, అందుకు ఆమె కొడుకుని హత్య చేసినట్లు పోలీసులకు చెప్పింది.

మరిన్ని వార్తలు