ఆర్థిక లావాదేవీలే కారణం..

4 Aug, 2018 11:15 IST|Sakshi
రామసుబ్రమణ్యం

సొంత పిన్నిపైనే యాసిడ్‌ దాడి

నిందితుడి అరెస్ట్‌

జీడిమెట్ల: స్కూల్‌ టీచర్‌పై యాసిడ్‌ దాడికి పాల్పడిన కేసులో నిందితుడిని జీడిమెట్ల పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. నిందితుడు బాధితురాలికి స్వయానా అక్క కుమారుడు కావడం గమనార్హం. ఇరు కుటుంబాల మధ్య గత కొన్ని రోజులుగా ఆర్ధిక లావాదేవీల కారణంగా గొడవలు జరుగుతుండటమే ఇందుకు కారణంగా పోలీసులు పేర్కొన్నారు...వివరాల్లోకి వెళితే..స్కూల్‌ టీచర్‌గా పని చేస్తున్న సూర్యకుమారి తన అక్కకుమారుడైన వెంకటరామ సుబ్రమణ్యంను 12 ఏళ్ల పాటు తన ఇంట్లోనే ఉంచుకుని పెంచింది.

అంతేగాక  అక్క,చెల్లెళ్ల కుమార్తెలను ఒకే ఇంటికి ఇచ్చి వివాహం జరిపించారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా నిందితు డి సోదరి హేమలక్ష్మి, ఆమె భర్త అదిత్య మ«ధ్య గొడవలు జరుగుతున్నా యి. ఈ విషయంలో సూర్యకుమారి తమకు సహాయం చేయడం లేదని, ఆర్థికంగా ఆదుకోవడం లేదని వెంకటరామసుబ్రమణ్యం ఆమెపై కోపం పెంచుకున్నాడు. దీనిని మనస్సులో పెట్టుకున్న అతను గురువారం సా యంత్రం ఆమెపై బాత్‌రూంలో వాడే యాసిడ్‌ చల్లి పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును చేధించిన సీఐ శంకర్‌ రెడ్డి, సిబ్బందిని బాలనగర్‌ ఏసీపీ అభినందించారు.

మరిన్ని వార్తలు