కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి | Sakshi
Sakshi News home page

కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

Published Sat, Aug 4 2018 11:11 AM

Parents Beaten bad Teacher In Amberpet hyderabad - Sakshi

అంబర్‌పేట: విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ ఉపాధ్యాయుడికి విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన సంఘటన శుక్రవారం అంబర్‌పేట పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ ఏపీ ఆనంద్‌కుమార్‌ కథనం ప్రకారం... డీడీ కాలనీలోని శ్రీచైతన్య స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రమేష్‌  గత కొంత కాలంగా 9వ తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.

అమ్మాయిలను అభ్యంతరకరంగా సెల్‌ఫోన్‌లో  చిత్రీకరించడం, వారిపై చేతులు వేస్తుండటంతో విద్యార్థినులు తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అగ్రహానికి లోనైన వారు శుక్రవారం స్కూల్‌కు వెళ్లి రమేష్‌ను పట్టుకుని చితకబాదారు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినుల తల్లిదండ్రల ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. ఏబీవీపీ నాయకులు ప్రవీణ్‌కుమార్, ఓయూ జేఏసీ నాయకులు శ్రీకాంత్‌ తదితరులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయుడితో పాటు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement