సినీ నటితో అసభ్య ప్రవర్తన

17 Jul, 2019 09:26 IST|Sakshi

బంజారాహిల్స్‌: తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీవీ9 యాంకర్‌ సత్య, కత్తి మహేష్‌లపై చర్యలు తీసుకోవాలని సినీ నటి సునీత బోయ మంగళవారం బంజారాహిల్స్‌పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. క్యాస్టింగ్‌ కౌచ్‌పై గతడాది ఏప్రిల్‌ 14న టీవీ9లో యాంకర్‌ సత్య నిర్వహించిన చర్చావేధికలో తనతో పాటు కత్తి మహేష్, నిర్మాత ప్రసన్నకుమార్‌ పాల్గొన్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా కత్తి మహేష్‌ మహిళలు, తన పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. దీనిపై తాను అప్పుడే కేసు పెట్టినట్లు తెలిపింది. అయితే బాధ్యులపై ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగేందుకు మంగళవారం టీవీ9 స్టూడియోకు వెళ్లిన తన పట్ల మరోసారి అసభ్యంగా ప్రవర్తించారన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు. 

మరిన్ని వార్తలు