గుర్రంపై ఊరేగాడని..

30 Apr, 2018 17:23 IST|Sakshi

భిల్వారా : పెళ్లిరోజు గుర్రంపై ఊరేగాడని దళితుడిపై గ్రామస్తులు ప్రతాపం చూపారు. అగ్రవర్ణాలకే పరిమితమైన ఈ సంప్రదాయాన్ని హైజాక్‌ చేశాడంటూ దళితుడిని బలవంతంగా గుర్రంపై నుంచి కిందకు దించి దారుణంగా కొట్టారు. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌కు 250 కిమీ దూరంలోని భిల్వారా జిల్లా గోవర్థనపుర గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పెళ్లికొడుకుపై గ్రామస్తుల దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు తాము ప్రయత్నించినా పెద్దసంఖ్యలో చేరుకున్న అల్లరి మూకలు దాడికి తెగబడ్డాయని పోలీసులు తెలిపారు.

దళిత యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేశామని చెప్పారు. పెళ్లి సందర్భంగా ఊరేగింపు నిర్వహించే దళిత పెళ్లికుమారులను అడ్డుకోవడం, వారిపై దాడిచేయడం వంటి ఘటనలు ఉత్తరాది రాష్ట్రాల్లో తరచూ చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. గుజరాత్‌లోని భావ్‌నగర్‌ జిల్లాలో  ఈ ఏడాది మార్చిలో ఓ దళితుడిని గుర్రంపై ఊరేగినందుకు అగ్రవర్ణాలకు చెందిన కొందరు హతమార్చిన ఘటన కలకలం రేపింది. 

మరిన్ని వార్తలు