కదులుతున్న కారులోనే భార్య, మరదలిని చంపి..

1 Dec, 2019 18:20 IST|Sakshi

పట్నా : బీహార్‌ రాజధాని పట్నా సమీపంలోని సైదాబాద్‌ ప్రాంతంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. ఒక ఆర్మీ జవాన్‌ తన పిల్లల కళ్ల ముందే కదులుతున్న కారులోనే తుపాకీతో కట్టుకున్న భార్యను, మరదలును కాల్చి చంపాడు. ఆపై తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

పాలిగంజ్‌ డీఎస్పీ మనోజ్‌ కుమార్‌ పాండే వివరాల ప్రకారం.. 33 ఏళ్ల విష్ణు కుమార్‌ గుజరాత్‌లో ఆర్మీ జవాన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య దామిని శర్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా రెండు నెలల క్రితం విష్ణుకుమార్‌కు డెంగ్యూ సోకింది. అప్పటి నుంచి విష్ణు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మానసిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో విష్ణుకు పట్నాలో చికిత్స చేయించడానికి తమ సొంత ఊరైన అరా నుంచి కారులో బయలుదేరారు. కారులో విష్ణుతో పాటు అతని భార్య, మరదలు డింపుల్‌ శర్మ, ఇద్దరు పిల్లలతో పాటు విష్ణు తండ్రి కూడా ఉన్నారు. డైవర్‌ పక్క సీటులో ఇద్దరు పిల్లలు వారి తాతయ్యతో కలిసి కూర్చోగా, వెనుక సీటులో విష్ణు, అతని భార్య, మరదలు కూర్చున్నారు.

ఈ సందర్భంగా విష్ణు, దామినిల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకోవంతో విచక్షణ కోల్పోయిన విష్ణు తన దగ్గర ఉన్న తుపాకీతో భార్య దామిని, మరదలు డింపుల్‌ను కాల్చి తర్వాత తనను తాను కాల్చుకొని చనిపోయాడని మనోజ్‌ వెల్లడించారు. విష్ణు తండ్రి అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. విష్ణు కాల్చిన తుపాకీతో  పాటు కారును పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విష్ణు వాడిన తుపాకీ లైసెన్స్‌ కలిగి ఉందని నిర్థారించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రియాంక హత్యపై అసభ్య పోస్ట్‌లు,కేసు నమోదు

అందరి ముందు బట్టలు విప్పించి..

పరీక్షల్లో పాస్‌ కాలేనేమోనని..

హైదరాబాద్‌లో మరో దారుణం..

విమానం కుప్పకూలి 9 మంది మృతి

అమృత ఫిర్యాదుతో మారుతీరావు అరెస్ట్‌

టీడీపీ నేత.. జీడిపిక్కల దందా

పెళ్లయిన రెండో రోజే..

ఫేస్‌ బుక్‌లో ప్రేమ.. హత్యకు కుట్ర

ఇంటర్‌ విద్యార్థి అనుమానాస్పద మృతి 

సంజనాతో మాజీ ఎమ్మెల్యే కొడుకు అసభ్య ప్రవర్తన

వావివరసలు మరిచి.. కోడలిపైనే కన్నేసి..

ఆమెది ఆత్మహత్యే!

అనంత’లో పట్టపగలు దారుణ హత్య

పుట్టినరోజు నాడే గ్యాంగ్‌రేప్‌

చర్లపల్లి జైలుకు ఉన్మాదులు

ముందే దొరికినా వదిలేశారు!

ప్రియాంక ఫోన్‌ నుంచి ఆరిఫ్‌కు కాల్‌

అనంతపురంలో ఎమ్మార్పీఎస్‌ నాయకుడి దారుణహత్య

విషాదం: ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

పాలకొల్లులో వివాహిత అనుమానాస్పద మృతి

నా కొడుకును ఎలా చంపినా పర్లేదు

ప్రియాంక హత్యకేసులో కొత్త ట్విస్ట్‌!

అమరావతిలో భారీ మోసం

కుటుంబ సభ్యులకు విషం; మరో వ్యక్తితో పరారీ..

ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురు మృతి

డబ్బులు సంపాదిద్దాం.. టార్గెట్‌ రూ.కోటి..!   

శంషాబాద్‌లో మహిళ మృతి కేసులో పురోగతి

రూ.125 కోసం హత్య 

భర్తను కిడ్నాప్‌ చేయించిన భార్య 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

టాలీవుడ్‌ హీరో మహేశ్‌ బాబు ఆవేదన

అదిరిపోయిన బాలయ్య 'రూలర్' ఫస్ట్ సాంగ్

నిర్భయంగా తిరిగే రోజెప్పుడు వస్తుందో!

వదినతో కలిసి నటించడం చాలా స్పెషల్‌

నిర్మాత తోట రామయ్య ఇక లేరు

అయ్యప్ప ఆశీస్సులతో...