బహిరంగ కాల్పులు జరిపిన ఉగ్రవాది అరెస్ట్‌

6 Feb, 2018 16:54 IST|Sakshi
ఉగ్రవాది నవీద్‌ జాట్‌ (ఫైల్‌)

శ్రీనగర్‌ : విచక్షణా రహితంగా కాల్పులు జరిపి, ఇద్దరు పోలీస్‌ ఆఫీసర్‌లను పొట్టనబెట్టుకొని పరారైన ఓ లష్కరే తోయిబా ఉగ్రవాదిని భద్రత బలగాలు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నాయి. మంగళవారం ఉదయం శ్రీనగర్‌లోని మహారాజా హరిసింగ్ హాస్పిటల్‌లో ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులతో తెగబడ్డ విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు మరణించగా ఒకరు గాయపడ్డారు.  కాల్పులు జరిపిన వ్యక్తి లష్కరే తోయిబా ఉగ్రవాది అబు హన్‌జుల్లా అలియాస్‌ నవీద్‌ జాట్‌గా గుర్తించారు. సెంట్రల్‌జైలు నుంచి ఆసుపత్రికి తీసుకొచ్చిన ఆరుగురి ఖైదీల్లో నవీద్‌ ఒకడు.

ఈ ఖైదీలకు కాపలాగా వచ్చిన పోలీసుల నుంచి ఆయుధాన్ని తీసుకొని వారిపై కాల్పులకు పాల్పడ్డాడని పోలీస్‌ అధికారులు పేర్కొన్నారు. 2015లో నవీద్‌ బీఎస్‌ఫ్‌ బలగాల కాన్వయ్‌పై దాడిచేసిన ఘటనలో అరెస్ట్‌ అయ్యాడని, అప్పటి నుంచి శ్రీనగర్‌ సెంట్రల్‌ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడని  తెలిపారు. అక్కడికి భద్రత బలగాలు చేరుకొని అణువనువు గాలిస్తున్నాయి. ఆసుపత్రిలో అత్యవసర, ఓపీ సేవలన్నింటిని నిలిపివేశారు.

మరిన్ని వార్తలు