మోటారు సైకిల్‌ దొంగల అరెస్టు

18 Dec, 2018 13:26 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న వాహనాలు, నిందితులను చూపుతున్న ఏఎస్పీ రాఘవ

రూ.5 లక్షల విలువైన ఆరు ద్విచక్రవాహనాలు సీజ్‌

గుంటూరు: వ్యసనాలకు బానిసలుగా మారి ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను గుంటూరు అర్బన్‌ సీసీఎస్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీసీఎస్‌ ఏఎస్పీ రాఘవ తన కార్యాలయంలో సోమవారం విలేకరులకు ఆ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకా రం... గుంటూరులోని హనుమయ్యనగర్‌కు చెం దిన ముత్తుకూరి సాయిరామ్‌ తాళం వేసి ఉన్న ద్విచక్రవాహనాలను చోరీ చేసిన కేసుల్లో గతంలో విజయవాడలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నా డు. క్యాటరింగ్‌ పనులకు వెళుతున్న క్రమంలో అక్కడ గుంటూరు రూరల్‌ మండలం అడవితక్కెళ్ళపాడుకు చెందిన షేక్‌ అల్లాభక్షు పరిచయం కావడంతో అతనితో పాటు కలసి ద్విచక్ర వాహనాలు చోరీ చేశారు.

గత నెల 8న అల్లా భక్షును పోలీసులు అరెస్టు చేయగా, ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ సమయంలో సాయిరామ్‌ తప్పించుకొని పరారయ్యాడు. ఈ క్రమంలో గుంటూరు రూరల్‌ మండలం దాసరిపాలెంకు చెందిన లంజేపల్లి షడ్రక్‌ అలియాస్‌ రవితో కలసి సాయిరామ్‌ ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఇద్దరు నిందితులు ద్విచక్రవాహనంపై అరండల్‌పేట ఫైఓవర్‌ వద్ద వేచి ఉన్నారు. వారు పోలీసులను గమనించి పరారవుతుండగా సీసీఎస్‌ పోలీసులు ఇద్దరినీ వెంటాడి అదుపులోకి  తీసుకొని, వారి దైనశైలిలో విచారించారు. చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. రూ.5 లక్షల విలువ చేసే బుల్లెట్‌తో పాటు ఐదు యాక్టివాలను స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీతో పాటు డీఎస్పీ డి.ప్రసాదు, సీఐ లు సీహెచ్‌వీబీ సుబ్రహ్మణ్యం, ఆర్‌.సురేష్‌బాబు, ఎస్సైలు కిషోర్, మహేంద్ర పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు