బడికిపోయినా బతికేవాడయ్యా...

5 Dec, 2018 13:07 IST|Sakshi
కాల్వలో పడి మృతి చెందిన బాలుడి మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబసభ్యులు

కాల్వలో జారిపడి బాలుడి మృత్యువాత

కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు

ఆటల రందిలో పడి ఎప్పుడో నాలుగు మెతుకులు తిని వెళ్లారు.. ఎటు వెళ్లారో ఏమో అనుకుంటూ బిడ్డల ఆకలి కళ్లలో దాచుకుని గుమ్మం వైపు ఎదురు చూసింది... మధ్యాహ్నం అన్నం వేళ దాటిపోవడంతో కలత చెందిన కన్న పేగు నా బిడ్డ ఎక్కడయ్యా అంటూ కనిపించిన ప్రతి ఒక్కరినీ వేడుకుంది.. ఇంతలో ఆమె కడుపుపై కన్నీటి కోత మిగుల్చుతూ బిడ్డ మృత్యువార్త ఆమె గుండెలపై రంపపు కోత కోసింది. ముప్పాళ్ల గ్రామంలో ఆటలకని వెళ్లిన ఐదేళ్ల బాలుడిని కాలువే మృత్యువై బలి తీసుకుంది. నిర్జీవమై పడి ఉన్న బిడ్డను చూసిన తల్లి..బడికిపోయినా బతికేవాడయ్యా అంటూ హృదయవిదారకంగా విలపించింది.

గుంటూరు, ముప్పాళ్ళ(సత్తెనపల్లి): అప్పటివరకు తన ఏడు నెలల చిన్న తమ్ముడిని ఆడించారు.ముద్దులాడారు. అంగన్‌వాడీ బడి కూడా లేకపోవటంతో మరో తమ్ముడు వికాస్‌తో కలిసి కాల్వకట్టకు వెళ్లారు. వారికి తెలియదు పాపం...వారి పక్కనే మృత్యువు పొంచి ఉందని... మనోహర్‌ తన తమ్ముడితో కలిసి కాల్వకట్టమీది నుంచి నీటిలోకి జారారు. కాల్వలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఒక్కసారిగా కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు ఒకరిని బయటకు తీయగా, మరొక బాలుడు గల్లంతై మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర సంఘటన మండల కేంద్రమైన ముప్పాళ్ళలో మంగళవారం జరిగింది. ముప్పాళ్ళ ఎస్సీ కాలనీకి చెందిన మన్నం మనోహర్‌(5) తన తమ్ముడు వికాస్‌తో కలిసి ఇళ్ల సమీపంలో ఉన్న పెదనందిపాడు బ్రాంచి కాలువ కట్టపై ఆడుకుంటూ కాల్వలోకి జారారు. అక్కడే పొలా లకు ఇంజన్‌తో నీళ్లు పెట్టుకుంటున్న రైతు గమనించి కేకలు వేయటంతో అక్కడే ఉన్న యువకులు పరుగులు తీశారు. అప్పటికే మనో హర్‌ నీటి ఉద్ధృతికి కొట్టుకుపోగా, వికాస్‌ మా త్రం పక్కనే ఉన్న జమ్ము, నాచులో ఇరుక్కుపోయి చేతులు పైకి కనిపిస్తుండటంతో బయటకు తీశా రు. వెంటనే వికాస్‌కు స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుని వద్ద చికిత్స అందించటంతో ప్రాణా పాయం నుంచి తప్పించుకున్నాడు.మనోహర్‌ మాత్రం గల్లంతయ్యాడు. విషయాన్ని ఎన్నెస్పీ అధికారులకు తెలియజేయటంతో కాల్వలో నీటి ఉద్ధృతిని తగ్గించారు. కొద్దిసేపటికి సమీపంలోని డ్రాపు వద్ద మనోహర్‌ మృతదేహం నీటిలో తేలియాడుతూ కనిపించటంతో బయటకు తీశారు.

కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు
ఎస్సీ కాలనీకి చెందిన మన్నం మరియబాబు ఆ టో నడుపుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య కృపమ్మ బాలింత కావటంతో ఇంటివద్దే ఉంటోంది. వీరికి మనోహర్, వికాస్‌తో పాటు మ రో ఏడు నెలల బాబు ఉన్నారు. మనోహర్, వికా స్‌ స్థానిక అంగన్‌వాడీ బడికి వెళుతుంటారు. అంగ న్‌వాడీ కార్యకర్త భర్త మృతి చెందటంతో మంగళవారం వారిద్దరూ కేంద్రానికి వెళ్లకుండా ఇంటివద్దే ఉన్నారు.అప్పటివరకు చిన్న తమ్ముడిని ఆడిం చిన వారిద్దరూ కనిపించకుండా పోవటంతో, అ ప్పటికే తల్లి కృపమ్మ వారి గురించి వాకబు చేస్తూనే ఉంది. అదే సమయంలో కాల్వలో పడ్డారని చెప్పటంతో నోటమాట రాకుండాపోయింది. ఒకడిని బయటకు తీయగా మరొకడు కాల్వలోనే గల్లంతయ్యాడని తెలిసి కన్నీటిపర్యంతమైంది. అ ప్పటివకు కళ్లముందున్న వాడు క్షణా ల్లోనే మృ త్యువాత పడటంతో తల్లిదండ్రులు,బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. బడికి పోయినా బతికేవాడయ్యా అంటూ తల్లి కృపమ్మ రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడిపెట్టించింది.

మరిన్ని వార్తలు