ఎంసేట్‌ లీకేజీ కేసు: 100కు చేరిన నిందితులు

7 Jul, 2018 19:56 IST|Sakshi
సీఐడీ అదుపులో వాసుబాబు

శ్రీ చైతన్య డీన్‌ వాసుబాబు రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

సాక్షి, హైదరాబాద్‌ : రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎంసెట్‌ (మెడికల్‌) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో నిందితులు శ్రీచైతన్య కాలేజీల డీన్‌ ఓలేటి వాసుబాబు(ఏ–89), ఏజెంట్ శివ నారాయణ రావు(ఏ90)లను మూడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ శనివారం నాంపల్లి కోర్టులో సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసింది. గత గురువారమే సీఐడీ ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో వాసుబాబును శ్రీచైతన్య యాజమాన్యం సస్పెండ్‌ చేసింది.

వాసుబాబు రిమాండ్‌ రిపోర్టు సాక్షికి అందింది. ఈ రిపోర్ట్‌లో కేసుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. కొడుకు మెడిసిన్‌ సీటు కోసమే వాసుబాబు 2015లో తొలి సారి ఈ లీకేజీలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్‌ సందీప్‌కుమార్‌ను కలిసాడని తెలుస్తోంది. 2016లో అతని కొడుకుకు కర్ణాటకలో మెడిసిన్‌ సీటు లభించిందని, ఈ పరిచయంతోనే సందీప్‌ హైదరాబాద్‌కు వచ్చినట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది. ఈ తరుణంలోనే చైతన్య కాలేజీలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులతో సందీప్‌ ఒక్కో విద్యార్థికి రూ.36 లక్షలు చోప్పున బేరం కుదుర్చుకొని, అడ్వాన్స్‌గా ఒక్కొక్కరి నుంచి 9 లక్షలు తీసుకున్నాడు. ఈ లీకేజీ వ్యవహారంపై గుంటూరు శివనారయణకు కూడా సమాచారం అందించడంతో.. గుంటూరు నుంచి మరో ముగ్గురు విద్యార్థులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విద్యార్థులను భువనేశ్వర్‌ క్యాంప్‌కు తరలించారు.

ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 64 మంది అరెస్ట్‌కాగా 26 మంది పరారీలో ఉన్నారు. తాజాగా మరో పది మంది నిందితులను సీఐడీ గుర్తించింది. దీంతో  మొత్తం నిందితుల సంఖ్య 100కు చేరింది. దేశవ్యాప్తంగా ఆరు చోట్ల బెంగళూరు, ముంబై, పుణె, షిర్డీ, కోల్‌కతా, భువనేశ్వర్‌ల్లో క్యాంపులు నిర్వహించనట్లు సీఐడీ గుర్తించింది. 85 మందిని సాక్ష్యులుగా చూపిన సీఐడీ.. వీరిలో విద్యార్ధులు, వారి తల్లితండ్రులను కూడా సాక్ష్యులుగా చూపింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బీహార్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోల మృతి

నైజీరియన్ల అక్రమ దందాకు తెర

షాద్‌నగర్‌ కేసులో రామసుబ్బారెడ్డికి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్‌

వంశీ కేసులో కొత్త కోణం

బాలికపై లైంగికదాడి

వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారే బాలికపై..

యువతి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు

మాజీ డ్రైవరే సూత్రధారి

యువతి అపహరణ

కన్నపేగును చిదిమి.. కానరాని లోకాలకు

కుక్క కోసం కత్తిపోట్లు

గుర్రంపై స్వారీ.. అంతలోనే షాక్‌..!

హైటెక్‌ వ్యభిచార కేంద్రం గుట్టు రట్టు

ఒంటరి మహిళ వేధింపులు తాళలేక..!

తెలిసిన వాడే కాటేశాడు

400 మెసేజ్‌లు.. షాకయిన బాధితుడు

బాలికను డాన్స్‌తో ఆకట్టుకొని.. కిడ్నాప్‌ చేశాడు

ప్రేమ పేరుతో వేదిస్తున్నందుకే హత్య

డబ్బులు చెల్లించమన్నందుకు దాడి

'బ్లాక్‌' బిజినెస్‌!

వివాహేతర సంబంధం: ఆమె కోసం ఇద్దరి ఘర్షణ!

జసిత్‌ను వదిలిపెట్టిన కిడ్నాపర్లు..!

కాల్చిపారేస్తా.. ఏమనుకున్నావో!

జసిత్‌ కోసం ముమ్మర గాలింపు

చిత్తురులో నకిలీ నోట్ల ముఠా గట్టురట్టు

కట్టడి లేని కల్తీ దందా

ఆర్మీ పేరుతో గాలం !

పెంపుడు కుక్క చోరీ

ఆర్థిక ఇబ్బందులతో బ్యూటీషియన్‌..

హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

త్రీడీ సూపర్‌ హీరో

నాకెవ్వరూ ప్రపోజ్‌ చేయలేదు!

రచనల్లో జీవించే ఉంటారు

కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు

పంద్రాగస్టుకు ట్రైలర్‌?

నా డియర్‌కామ్రేడ్స్‌కి అంకితం