మత ఘర్షణల్లో 1,605 మంది మృతి

3 Jan, 2019 04:34 IST|Sakshi

నోయిడా: భారత్‌లో 2004 నుంచి 2017 వరకు జరిగిన 10,399 మత ఘర్షణల్లో ఏకంగా 1,605 మంది ప్రాణాలు కోల్పోయారు. 30,723 మంది గాయాలపాలయ్యారు. సమాచార హక్కు చట్టం కింద నోయిడాకు చెందిన ఐటీ ఉద్యోగి, ఆర్టీఐ కార్యకర్త అమిత్‌ గుప్తా అభ్యర్థించిన మేరకు కేంద్ర హోంశాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఒక్క 2008లోనే అత్యధికంగా 943 మతసంబంద కేసులు నమోదయ్యాయని, ఆ ఏడాదిలోనే అధికంగా 167 మంది చనిపోయారని కేంద్రం పేర్కొంది. అత్యంత తక్కువ మత కేసులు 2011లో నమోదయ్యాయి. ఆ ఏడాదిలో 91 మంది మరణించారని, 1,899 మంది గాయపడ్డారని తెలిపింది. 2017లో 822 కేసులు నమోదవగా, ఆ ఏడాది ఘర్షణల్లో 111 మంది చనిపోయారు.

మరిన్ని వార్తలు