రివాల్వర్‌తో కాల్చుకుని జవాన్‌ ఆత్మహత్య

9 Mar, 2020 09:07 IST|Sakshi
బబన్‌ విఠల్‌రావు మన్వర్‌ (ఫైల్‌)

మానసిక ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణం

జవహర్‌నగర్‌: కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటంతో పాటు మానసిక ఒత్తిడికి గురైన ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ తన రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లోని సీఆర్‌పీఎఫ్‌ క్యాంపస్‌లో ఆదివారం చోటుచేసుకుంది. జవహర్‌నగర్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ జిల్లా పవన్‌నగర్‌ గ్రామానికి చెందిన బబన్‌ విఠల్‌రావు మన్వర్‌ (44) సీఆర్‌ఫీఎఫ్‌ క్యాంపస్‌లో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

నెల రోజుల పాటు సెలవులపై సొంతూరికి వెళ్లి ఈ నెల 2న తిరిగి విధుల్లో చేరాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నానని తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాడు. ఈ క్రమంలో మానసిక ఒత్తిడి తీవ్రమవడంతో ఆదివారం ఉదయం డ్యూటీలో ఉండగానే తన సర్వీస్‌ రివాల్వర్‌తో తలపై కాల్చుకుని అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఎనిమిదేళ్ల కుమారుడు, రెండున్నరేళ్ల కూతురు ఉంది. సీఆర్‌పీఎఫ్‌ డిప్యూటీ కమాండెంట్‌ రత్నమ్మ ఫిర్యాదు మేరకు జవహర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా