ఇద్దరిని బలిగొన్న వివాహేతర సంబంధం

28 Dec, 2019 03:53 IST|Sakshi

వివాహితపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి తాను నిప్పంటించుకున్న ప్రియుడు

వికారాబాద్‌ జిల్లా అగ్గనూరులో ఘటన  

యాలాల: తనను దూరం చేస్తోందని భావించిన ఓ వ్యక్తి ఓ వివాహితపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి ఆపై అతడు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో వివాహిత, ప్రియుడు మృతిచెందారు. ఘటన వికారాబాద్‌ జిల్లా యాలాలలోని అగ్గనూరులో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మక్త హన్మప్ప, చంద్రమ్మ మూడో కుమార్తె మక్త అంజిలమ్మ (35)కు పదేళ్ల కిందట వెంకటయ్యతో వివాహమైంది. అయితే అంజిలమ్మ భర్తను వదిలేసి తల్లిదండ్రుల వద్ద ఉంటుంది.

ఈ క్రమంలో చెన్‌గేస్‌పూర్‌కు చెందిన నర్సింహులు (36)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే ఇటీవల అంజిలమ్మ అతడిని దూరం చేస్తూ తన వద్దకు రావొద్దని చెప్పడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెను అంతమొందించాలనుకున్న అతడు గురువారం అర్ధరాత్రి పెట్రోల్‌ బాటిల్‌తో అంజిలమ్మ ఇంటికి వచ్చాడు. నిద్రిస్తున్న అంజిలమ్మపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. అనంతరం తాను పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. కుమార్తెను కాపాడేందుకు యత్నించిన తల్లిదం డ్రులకు∙గాయాలయ్యాయి. వారిని తాండూరు లోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నలుగురిని హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అంజిలమ్మ, నర్సింహులు మృతి చెందారు. నర్సింహులుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంజిలమ్మకు సంతానం లేరు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు