దారుణం: కర్రలతో కొట్టి.. బండరాయితో మోది!

8 Feb, 2020 10:25 IST|Sakshi
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్న కవిత

సాక్షి, మునుగోడు(నల్గొండ) : ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఓ యువతిపై తల్లిదండ్రులతో పాటు సోదరుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఎల్గలగూడెంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన తిరిపారి బుచ్చయ్య లక్ష్మమ్మ దంపతులకు నలుగురు కుమారైలు, కుమారుడు సంతానం. అయితే  ముగ్గురు కుమార్తెలతోపాటు కుమారుడి వివాహాలు చేశారు.   చిన్న కుమారై కవిత రెండేళ్ల క్రితం ఎంఎస్సీ కెమిస్ట్రీ విద్యను పూర్తి చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని, లేదంటే ప్రధాన రహదారి వెంట ఉన్న భూమిని తన పేర పట్టా చేయాలని ఏడాది కాలంగా తల్లితండ్రులను  ఒత్తిడి చేస్తోంది. అయినా ఆ కుటుంబ సభ్యులు తమకేమి పట్టనట్లు వ్యవహరించడంతో పోలీసులను ఆశ్రయించింది.  

దీంతో పోలీసులు పలుమార్లు కుటుంబ సభ్యులకు కౌన్సింగ్‌ ఇచ్చారు. దీంతో కవితను మట్టుబెట్టాలని తల్లిదండ్రులతో పాటు సోదరుడు గోవర్ధన్‌ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే  శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో కవిత గాఢ నిద్రలో ఉండగా కర్రలతో దాడి చేసి బండరాయితో బలంగా మోదారు. దీంతో కవిత చనిపోయిందని భావించి ఇంటి పక్కనే ఉన్న బాట ముళ్ల పొదలల్లో పడేశారు. దానిని గమనించిన పక్కంటి వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయపడిన కవితను న      ల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కవిత పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కాగా నిందితులు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు  ఎస్‌ఐ రజినీకర్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా