కాంగ్రెస్‌ను ఓడించేందుకే ఆయనకు టికెట్‌.. రమేష్‌ రెడ్డి ఫైర్‌

10 Nov, 2023 08:50 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట: తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు పార్టీ హైకమాండ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తమకే టికెట్‌ వస్తుందని ఆశించిన నేతలు.. చివరి నిమిషంలో టికెట్‌ రాకపోవడంతో ఫైరవుతున్నారు. టికెట్‌ దక్కకపోవడంతో తాజాగా పటేల్‌ రమేష్‌ రెడ్డి సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. 

కాగా, రమేష్‌ రెడ్డి మాట్లాడుతూ.. సూర్యాపేట టికెట్‌ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నాను. నాకే టికెట్‌ ఇస్తానని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళ్తున్నాను. చివరకి నాకు అన్యాయం చేశారు. సూర్యాపేట టికెట్‌ దామోదర్‌ రెడ్డికి కేటాయించడం కుట్రలో భాగమే. ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకుని మంత్రి జగదీష్‌ రెడ్డిని గెలిపించడం కోసమే ఇదంతా చేశారు.

బీఆర్‌ఎస్‌తో ఒప్పందం పెట్టుకుని కాంగ్రెస్‌ పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తాం. కార్యకర్తలతో మాట్లాడి కాంగ్రెస్‌ పార్టీని సూర్యాపేటలో బ్రతికించేలా నిర్ణయం తీసుకుంటాం. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్ధం కావడం లేదు. త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాను అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో, సూర్యాపేటలో కాంగ్రెస్‌ పార్టీలో కోల్డ్‌వార్‌ ప్రారంభమైంది. 

ఇది కూడా చదవండి: హ్యాండిచ్చిన కాంగ్రెస్‌.. అద్దంకి దయాకర్‌ రియాక్షన్‌ ఇదే..

మరిన్ని వార్తలు