చంద్రిక హత్య : కారణం ఇదే..

1 Jul, 2018 11:51 IST|Sakshi

చందర్లపాడు (నందిగామ) : తండ్రి క్షణికావేశానికి కన్నకూతురు ప్రాణాలు పోగొట్టుకుంది. ఫోన్‌లో మాట్లాడుతోందని ఆగ్రహించిన తండ్రి కర్రతో తలపై మోదటంతో అక్కడికక్కడే మృతి చెందింది. వివరాలు.. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామానికి చెందిన తొండపు కోటయ్య, పద్మావతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె చంద్రిక (22) గుడ్లవల్లేరులో బీఫార్మసీ పూర్తి చేసి ఇంటివద్దనే ఉంటోంది. చిన్న కుమార్తె శిరీష బీటెక్‌ చదువుతోంది. బీఫార్మసీ పూర్తి చేసిన చంద్రికను తల్లిదండ్రులు ఎంఫార్మసీ చేయించాలనుకున్నారు.

ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం చంద్రిక ఫోన్‌లో మాట్లాడుతుండగా.. ప్రియునితో మాట్లాడుతోందని అనుమానించిన తండ్రి కోటయ్య ఆవేశంతో అందుబాటులో ఉన్న కర్ర తీసుకుని ఆమె తలపై మోదాడు. కుప్పకూలిన చంద్రిక అక్కడికక్కడే మృతి చెందింది. చంద్రిక తన 22వ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంది. మరుసటి రోజే ఇలా జరిగింది. మృతురాలి తాత పారా రామారావు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదుచేశారు.

ప్రేమ విషయం తెలియడం వల్లే : చంద్రిక హత్య వెనుక ప్రేమ వ్యవహారం ఉందని నందిగామ పోలీసులు నిర్ధారించారు. ఆమె ఫోన్‌లో మాట్లాడిన యువకుడిని ప్రశ్నించగా తమ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు అంగీకరించాడు. తమ ప్రేమ విషయాన్ని చంద్రిక ఇంట్లో చెప్పడంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించాడు. అయితే చంద్రిక కుటుంబ సభ్యుల వాదన మాత్రం మరోలా ఉంది. తల్లిదండ్రుల మధ్య గొడవలో వెళ్లడంతో జరిగిన పొరపాటు కారణంగా చంద్రిక చనిపోయిందని చెబుతున్నారు. కారణం ఏమైనా నిందితుడికి కచ్చితంగా శిక్ష పడుతుందని పోలీసులు తెలిపారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దుస్తులు విప్పితేనే.. యాక్టింగ్‌.. నిందితుడు అరెస్ట్‌!

ప్రముఖ దర్శకుడిపై జూనియర్‌ నటి తీవ్ర ఆరోపణలు

గోవిందరాజ స్వామి ఆలయ దొంగ అరెస్ట్‌

వీఆర్వో ఆత్మహత్య

నలుగురు పాత నేరస్తుల అరెస్టు

జైలు సిబ్బందిపై ఖైదీ ఫిర్యాదు

అవినీతి రిజిస్ట్రేషన్‌

మింగారు.. దొరికారు...

విహార యాత్ర.. విషాదఘోష

చావుకూ–బతుక్కీ నడుమ ఐదు నిమిషాలే..!

జీవితంపై విరక్తితో యువకుడి ఆత్మహత్య

జనవరిలో వివాహం..అంతలోనే

భార్యపై భర్త లైంగిక ఉన్మాదం 

బాలుడి సమాచారం... భారీ నేరం

ప్రేయసి కోసం పెడదారి

చోరీలకు పాల్పడుతున్న దంపతుల అరెస్ట్‌

ఆమెగా చెప్పుకున్న నైజీరియన్‌ అరెస్టు

బీజేపీ నేతపై దాడి

అర్ధరాత్రి అభ్యంతరకరంగా సంచరిస్తున్న జంటలు..

పదో తరగతి బాలికకు గర్భం.. 

ఫేస్‌బుక్‌ పరిచయం కొంప ముంచింది 

కలిసే చదివారు... విడివిడిగా చేరారు!

ఆగని కన్నీళ్లు

మద్యం మత్తులో మృత్యువుతో ఆట.. విషాదం!

అమ్మాయి పేరుతో అలీని చీట్‌ చేశారు

నయీమ్‌ అనుచరుడునంటూ బెదిరింపులు

భార్య, పిల్లలను చంపిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

దారుణం; పార్టీకి రాలేదని నానమ్మను..

కుక్క మూత్రం పోసిందని.. మహిళలపై దాడి

నా ఇద్దరు కొడుకుల ఆస్తిపై కన్నేసింది : ఎన్డీ తివారి భార్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘దేవుడు ఇలా రివేంజ్‌ తీర్చుకున్నాడు.. చై’

అప్పుడు తండ్రి.. ఇప్పుడు విలన్‌..!

రణ్‌బీర్‌తో అనుబంధంపై అలియా రిప్లై

ప్రముఖ దర్శకుడిపై జూనియర్‌ నటి తీవ్ర ఆరోపణలు

ప్రభాస్‌ సినిమా కాపీయే!

సినిమా పాటరాయడం చాలా కష్టం..