పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం

13 Jul, 2020 23:33 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : పరవాడ ఫార్మా సిటీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విశాఖలోని సాల్వెంట్ కంపెనీలో రియాక్టర్‌ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు, సిబ్బంది భయాందోళనలతో పరుగులు తీశారు. అయితే మంటలు అదుపు చేయడానికి అగ్నిమాపక శకటాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఈ ప్రమాదంలో కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది గాయపడినట్లు సమాచారం. గాయపడిని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

పరవాడ  ఫార్మాసిటీలోని వేరువేరు కంపెనీలో మందులు తయారు చేసే క్రమంలో వచ్చే ఒక రకమైన వృథా ఆయిల్‌ను తిరిగి శుభ్రం పరిచే ప్రక్రియ ఈ కంపెనీలో జరుగుతుంది. ప్రతి రోజు మాదిరిగానే రాత్రి పది గంటలకు నైట్‌ షిఫ్ట్‌ మొదలైన కొద్దిసేపట్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల రసాయన వాయువులు లీకై ఇద్దరు మృతి చెందిన సాయినాథ్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీకి సమీపంలోనే ఈ పరిశ్రమ ఉండటం గమనార్హం.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా