ఏకాంతం కోసం ప్రియుడితో.. భయపెట్టి గ్యాంగ్‌ రేప్‌

8 Jan, 2020 13:07 IST|Sakshi

భోపాల్‌: సభ్య సమాజం తలదించుకునేలా భోపాల్‌లో మరో ఉదంతం వెలుగు చూసింది. మధ్యప్రదేశ్‌లో ఓ యువతి దారుణంగా లైంగికి దాడికి గురైంది. ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థినిపై బీహెచ్‌ఈఎల్‌లో పనిచేసే సెక్యూరిటీ గార్డుతో పాటు, మరో వ్యక్తి లైంగిక దాడికి పాల్పడడం స్థానికంగా సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. 12వ తరగతి చదువుతున్న యువతి, తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఏకాంత ప్రదేశంలో మాట్లాడుకుంటూ ఉండగా.. ఇద్దరు వ్యక్తులు వారిపై కర్రలతో దాడి చేశారు. అనంతరం ఇరువురిని వివస్త్రలుగా చేసి వీడియోలు చిత్రీకరించారు.

చదవండి: 'గత 15 ఏళ్లలో నలుగురికి మాత్రమే ఆ శిక్ష'

తమకు వెంటనే రూ. 5వేలు ఇస్తే వీటిని తొలగిస్తామని లేకపోతే సామాజిక మాద్యమాల్లో పెడతామంటూ బయపెట్టారు. దీంతో ఏం చేయాలో తోచని ఆ యువకుడు తన ప్రియురాలిని అక్కడే వదిలి రూ. 5 వేలు తెచ్చేందుకు స్కూటర్‌పై సంఘటనా స్థలం నుంచి వెళ్లి తిరిగి రాగా, యువతి భోరున విలపిస్తూ కనిపించింది. యువతిని విషయం అడగగా ఆ ఇద్దరు తనపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలిపింది.

దీంతో షాక్‌ తిన్న ప్రియుడు వెంటనే, తన మిత్రుడి సాయంతో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి కస్టడీకి తరలించారు. నిందితులలో ఒకరు బీహెచ్‌ఈఎల్‌లో సెక్యూరిటీగా పనిచేసే సూర్యవంశీ (35) కాగా.. మరో వ్యక్తి స్థానికంగా నివాసం ఉండే రాజ్‌పుత్‌గా గుర్తించారు. వీరిపై అత్యాచారం, దోపిడీ కేసులను నమోదు చేసినట్లు భోపాల్‌ ఐజీ మీడియాకు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు