గురుగ్రామ్‌ : జడ్జి కొడుకు బ్రెయిన్‌ డెడ్‌

15 Oct, 2018 11:27 IST|Sakshi

గురుగ్రామ్‌ : సెలవు ఇవ్వలేదన్న కోపంతో జడ్జి భార్య, కొడుకుపై సెక్యూరిటీ గార్డ్‌ కాల్పులు జరిపిన హరియాణాలోని గురుగ్రామ్‌లో శనివారం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన జడ్జి భార్య మరణించగా, అతని కుమారుడు బ్రెయిన్‌ డెడ్‌కు గురైనట్లు డాక్టర్లు వెల్లడించారు. హరియాణా పోలీస్‌శాఖలో హెడ్‌ కానిస్టేబుల్‌గా ఉన్న మహిపాల్‌ సింగ్‌ రెండెళ్లుగా అదనపు సెషన్స్‌ జడ్జి కృష్ణకాంత్‌ శర్మ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే చాలా కాలంగా ఇంటికి వెళ్లేందుకు సెలవు ఇవ్వాలని మహిపాల్‌ సింగ్‌ విజ్ఞప్తి చేసినా ఫలితం దక్కలేదు. దీనికితోడు న్యాయమూర్తితో పాటు ఆయన కుటుంబీకులు మహిపాల్‌ సింగ్‌ను తరచూ దూషించేవారనే కోపంతో సదరు పోలీసు జడ్జి భార్య రీతూ, కొడుకు ధ్రువ్‌లపై శనివారం అర్కాడియా మార్కెట్‌లో కాల్పులకు పాల్పడ్డాడు.

ఈ ఘటనలో బెల్లెట్‌ ధ్రువ్‌ తలలోకి దూసెకెళ్లడంతో అతనికి తీవ్ర రక్త స్రావమైనట్లు వైద్యులు తెలిపారు. కాగా ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జడ్జి భార్య రీతూ మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. ప్రస్తుతం పోలీసుల కస్టడిలో ఉన్న మహిపాల్‌, జడ్జి కుటుంబం తనను తరచుగా దూషించడం మూలానే తాను ఈ దాడికి పాల్పడినట్లు తెలిపాడని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు