కూతురి అక్రమ బంధం.. పరువు హత్య !

12 Feb, 2020 08:49 IST|Sakshi

కూతురిని చంపిన తండ్రి  

సాక్షి, కర్ణాటక, బళ్లారి: వివాహేతర సంబంధం పర్యవసానంగా పరువు హత్య చోటుచేసుకుంది. తండ్రి చేతిలో కూతురి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన బళ్లారి తాలూకా గోడేహళ్‌ గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడు గోపాలరెడ్డి కాగా, హతురాలు అతని కుమార్తె కవిత (22). పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం...గోడేహళ్‌ గ్రామంలో నివసించే రైతు గోపాల్‌రెడ్డి కుమార్తె కవితకు నాలుగేళ్ల క్రితం జిల్లాలోని సండూరు తాలూకా కురెకుప్ప గ్రామానికి చెందిన యువకునితో పెళ్లి చేశారు. అయితే కవితకు అక్కడే ప్రకాశ్‌ అనే యువకునితో పరిచయం ఏర్పడింది. రెండు నెలల నుంచి భర్తను వదలి ప్రియునితో ఉంటోంది. కవిత భర్త.. భార్య కనిపించడం లేదని తోరణగల్లు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల కవిత పుట్టింటికి వచ్చింది. ప్రియుడు కూడా వచ్చి కవితను తనతో రావాలని గొడవకు దిగడం జరిగింది. ఈ సంఘటనతో తండ్రి గోపాలరెడ్డి ఎంతో మథన పడ్డారు. సోమవారం రాత్రి కూతురితో ఆయన ఘర్షణ పడ్డాడు. ఈ గొడవలో ఆమె విగతజీవిగా మారింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా