హెచ్‌ఐవీ వ్యాధితో బాధపడుతున్నానని చెప్పిన వినకుండా..

15 May, 2019 16:19 IST|Sakshi

ముంబై : మహారాష్ట్రలో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. హెచ్‌ఐవీ వ్యాధితో బాధపడుతున్నాని చెప్పిన వినకుండా ఓ మహిళ(37)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. గత శుక్రవారం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న తన సోదరికి సహాయంగా ఆస్పత్రిలో ఉంటోంది ఓ మహిళ. తను హెచ్‌ఐవీ వ్యాధితో బాధపడుతున్నా.. తన సోదరికి చేదోడు వాదోడుగా ఉండేందుకు ఆస్పత్రికి వచ్చారు. అయితే ఆమెపై కన్నేసిన ఓ యవకుడు... మాయమాటలు చెప్పిన ఆమెపై లైంగిక దాడి చేయాలని పథకం పన్నాడు. 

ఇందులో భాగంగా బాధితురాలితో మాట మాట కలిపిన నిందితుడు...తాను అక్కడ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నానని నమ్మించాడు. ఆమెకు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశాడు. అందుకు ఆమె ఔనని సమాధానం చెప్పింది. ఆస్పత్రిలో పైఅంతస్తులో ఉన్న డిపార్ట్‌మెంట్‌లో ఫామ్ నింపితే మందులు, చికిత్సలో రాయితీ ఇస్తారని నమ్మించిన నిందితుడు... ఆమెను డాబాపైకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు శారీరికంగా బలహీనంగా ఉండటంతో... అతడి నుంచి తప్పించుకోలేకపోయారు. తనకు హెచ్‌ఐవీ వ్యాధి ఉందని చెప్పిన వినకుండా పశువులా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే సమీపంలోని సియాన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా దీపక్‌ అన్నప్ప అనే యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు