బాబాయ్‌ ఇంట్లో ఎవరూ లేరని తెలియడంతో..

4 Sep, 2019 06:33 IST|Sakshi

సాక్షి, కర్నూలు : స్థానిక కటిక వీధికి చెందిన షంషావలి ఇంటిలో చోటు చేసుకున్న చోరీ ఘటన అతని అన్న కుమారుడి పనేనని పోలీసులు తేల్చారు. ఈ మేరకు నిందితున్ని అదుపులోకి తీసుకుని చోరీ చేసిన సొమ్మును రికవరీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను కోడుమూరు సీఐ పార్థసారథిరెడ్డి మంగళవారం విలేకరులకు వెల్లడించారు. గత నెల 28వతేదీ షంషావలి.. కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న షంషావలి అన్న కొడుకు అనిఫ్‌ ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డాడు.

బీరువాలోని రూ. 5 లక్షల విలువైన పది తులాల బంగారు బిస్కెట్, 6 గ్రాముల బంగారు ఉంగరం ఎత్తు కెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఏ పని లేకుండా తిరుగుతున్న నిందితుడు జల్సాల కోసం రూ. 5 లక్షలు అప్పు  చేశాడని, రుణదాతల నుంచి ఒత్తిడి అధికం కావడంతో దొంగతనాలకు అలవాటు పడ్డాడని సీఐ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ విజయభాస్కర్, ఏఎస్‌ఐ గోపాల్, కానిస్టేబుళ్లు   పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు