ప్రాణం తీసిన లిక్కర్‌

28 Mar, 2018 16:27 IST|Sakshi

చెన్నై: మద్యం కోసం జరిగిన తగాదా మానవత్వాన్ని మరిచేలా చేసింది. తన కోసం తెచ్చుకున్న మద్యాన్ని తాగిందనే కారణంతో తల్లిని కడతేర్చాడు ఓ తనయుడు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. కూలీగా పనిచేస్తున్న నీలకందన్‌ అనే 25 ఏళ్ల యువకుడు తల్లి కళావతితో కలిసి చెన్నైలో జీవిస్తున్నాడు. లిక్కర్‌ కొనితెచ్చుకున్న నీలకందన్‌ తల్లికి కనపడకుండా దాచిపెట్టాడు. ఇది గమనించిన తల్లి దొంగచాటుగా మద్యం తాగింది. దీంతో ఆగ్రహించిన కొడుకు ఆమెతో తగాదాకు దిగాడు. ఆవేశంలో చేతిలో ఉన్న పైప్‌తో ఆమె తలపై బలంగా కొట్టడంతో బిగ్గరగా కేకలు వేసింది. గమనించిన ఇరుగుపొరుగు వారు ఆమెను ఆస్పత్రికి తరలించగా మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు నీలకందన్‌ని అరెస్టు చేసి, విచారిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు