దారుణం: ఆగిన లిఫ్టు.. ఆ సమయంలో..

8 Mar, 2020 14:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై : ఆగిఉన్న లిఫ్టులో బధిర మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడో వ్యక్తి. ముంబైలోని మేఘ్‌వాడి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొన్నిరోజుల క్రితం మేఘ్‌వాడిలోని జోగేశ్వరికి చెందిన ఓ బధిర యువతి తల్లితో కలిసి ఆసుపత్రిలో ఉన్న తండ్రిని చూడటానికి వెళ్లింది. అనంతరం ఇద్దరూ తాముంటున్న హౌసింగ్‌ కాంప్లెక్స్‌కు తిరిగివచ్చారు. పై అంతుస్తుల్లో ఉన్న ఫ్లాట్‌కు వెళ్లేందుకు లిఫ్ట్‌ ఎక్కారు. అదే కాంప్లెక్స్‌లో ఉంటున్న ఓ 50 ఏళ్ల వ్యక్తి వారితో పాటు లిఫ్ట్‌ ఎక్కాడు. నాలుగవ అంతస్తుకు రాగానే లిఫ్ట్‌ ఆగిపోయింది. మహిళ తల్లి మొదట లిఫ్టులోంచి బయటకు చేరుకుంది.

ఈ సమయంలో లోపల ఉన్న అతడు బధిర మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు సంజ్ఞల ద్వారా తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లికి వివరించింది. అంతేకాకుండా గతంలోనూ అతడు తనపై లైంగిక దాడి చేసినట్లు తెలిపింది. బాధితురాలి తల్లిదండ్రులు ఈ విషయంపై అతన్ని నిలదీయగా ఎదురుదాడికి దిగాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు