ప్రియురాలి దీక్ష.. విషం తాగిన ప్రియుడు..

14 Jul, 2018 18:15 IST|Sakshi
ప్రియుడు భాస్కర్‌తో జ్యోతి (పాత ఫొటో)

సాక్షి, యాదాద్రి భువనగిరి : ప్రేమించినవాడు పెళ్లి చేసుకోమంటే బుకాయిస్తూ, మరో పెళ్లికి సిద్ధపడుతున్నాడని ఓ యువతి అతడి ఇంటి ముందు దీక్షకు దిగింది. ఈ ఘటన జిల్లాలోని వలిగొండ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన పల్లపు జ్యోతి వలిగొండకు చెందిన రావుల భాస్కర్‌ ప్రేమించుకున్నారు. అయితే, భాస్కర్‌ వివాహానికి నిరాకరిస్తున్నాడని ఆరోపిస్తూ అతడి ఇంటి ముందు జ్యోతి దీక్షకు దిగారు.

అప్పటికి వివాహానికి నిరాకరించడంతో వలిగొండ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత మూడు రోజులుగా ఫిర్యాదు చేస్తూ పోలీసులు పట్టించుకోవడం లేదంటూ శనివారం స్థానిక వేంకటేశ్వర థియేటర్‌ పక్కన ఉన్న సెల్‌ టవర్‌ ఎక్కి తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో ప్రియుడు భాస్కర్‌ను వలిగొండ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు పెళ్లి చేసుకోవాలని సూచించారు.

అందుకు నిరాకరించిన భాస్కర్‌ ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో అతడిని హుటాహుటిని రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు