కన్నకూతురిపై తండ్రి కర్కశత్వం

2 Jun, 2020 17:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చెన్నై: మాంత్రికుడి మాటలు నమ్మి కన్నబిడ్డ పట్ల కర్కశకంగా ప్రవర్తించాడో దుర్మార్గపు తండ్రి. మృగంలా మారి ఆమె గొంతు కోశాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాలు.. పుదుకొట్టై జిల్లాకు చెందిన పనీర్‌సెల్వంకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అయితే కొడుకు లేడనే బాధ అతడిని మెలిపెడుతూ ఉండేది. ఈ క్రమంలో ఇటీవల అతడికి పరిచయమైన ఓ మాంత్రికుడు.. కూతుర్ని బలిస్తే.. కొడుకు పుడతాడని చెప్పాడు. అంతేగాక ఆమె చావుతో ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరతాయని నమ్మబలికాడు.(దొంగల దాడిలో మహిళ మృతి)

ఆ మాంత్రికుడి మాటలు నమ్మిన పనీర్‌సెల్వం.. కూతురిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. మే 18న ఇంటికి సమీపంలో ఉన్న బావి నుంచి నీళ్లు తోడుకు వచ్చేందుకు వెళ్లిన బాధితురాలి(13)ని తీవ్రంగా కొట్టాడు. అనంతరం ఆమె గొంతు కోసి చంపేశాడు. ఈ క్రమంలో బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు తొలుత అత్యాచారం కేసుగా అనుమానించారు. అనంతరం తమదైన శైలిలో విచారణ జరుపగా... పనీర్‌సెల్వమే హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో అతడిని అరెస్టు చేశారు.  (ప్రాణం తీసిన వివాహేతర బంధం)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా