వివాహిత అనుమానాస్పద మృతి

26 Jan, 2020 16:09 IST|Sakshi

బొమ్మనహళ్లి : గత 11 నెలల క్రితం వివాహం జరిగిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరం సమీపంలోని ఆనేకల్‌ తాలుకా నెరళూరు గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మృతురాలిని హోసదుర్గకు చెందిన లోకేశ్వరి (29)గా గుర్తించారు. లోకేశ్వరికి ఆనేకల్‌కు చెందిన నవీన్‌కుమార్‌తో 11 నెలల కిందట వివాహం జరిగింది. దంపతులు నెరళూరులో నివాసం ఉంటున్నారు.

శుక్రవారం అర్ధరాత్రి తన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని భర్త నవీన్‌కుమార్‌ అత్తిబెలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం సాయంత్రం తమ కుమార్తె ఫోన్‌లో మాట్లాడిందని,అంతలోపే ఆమె మరణవార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని లోకేశ్వరి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేశారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నవీన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు